IND VS PAK : పోరాడుతున్న పాకిస్థాన్.. కట్టడి చేస్తున్న భారత్.. 25 ఓవర్లలో రెండు వికెట్లు డౌన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

IND VS PAK : పోరాడుతున్న పాకిస్థాన్.. కట్టడి చేస్తున్న భారత్.. 25 ఓవర్లలో రెండు వికెట్లు డౌన్

 Authored By kranthi | The Telugu News | Updated on :14 October 2023,3:57 pm

IND VS PAK : దాయాదుల పోరు ఆరంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోగా.. పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ సందడే వేరు. అది వరల్డ్ కప్ అంటే.. ప్రపంచమంతా ఈ మ్యాచ్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంది. ఆ తరుణం రానే వచ్చింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం దానికి వేదిక అయింది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అయింది. ఇక క్రికెట్ అభిమానులు అయితే అందరూ టీవీలకు అతుక్కుపోయారు. ఇప్పటి వరకు పాకిస్థాన్ 25 ఓవర్లు ఆడింది. అంటే సగం మ్యాచ్ అయిపోయినట్టే లెక్క. 25 ఓవర్లలో రెండు వికెట్లను పాకిస్థాన్ కోల్పోయింది. 25 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి పాకిస్థాన్ 125 పరుగులు చేసింది.

ఓపెనర్లు అబ్దుల్లా, ఇమామ్ ఇద్దరూ అవుట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజ్ లో కెప్టెన్ బాబర్ అజామ్, రిజ్వాన్ ఉన్నారు. అబ్దుల్లా 24 బంతుల్లో 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పాకిస్థాన్ మంచి ఫామ్ లోనే ఉంది. స్కోర్ బాగానే చేస్తోంది. ఇక.. ఇమామ్ 38 బంతుల్లో 36 పరుగులు చేశాడు. క్రీజులో ఉన్న అజామ్ 43 బంతుల్లో 34 పరుగులు చేశాడు. రిజ్వాన్ 41 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ఇక.. బౌలింగ్ విషయానికి వస్తే.. బుమ్రా 4 ఓవర్లు వేసి 14 పరుగులు ఇచ్చాడు. సిరాజ్, పాండ్యా చెరో వికెట్ తీశారు.

pakistan lost 2 wicket in 20 overs in india vs pakistan world cup match

#image_title

ఈ మ్యాచ్ ను ప్రపంచమంతా టీవీల్లో తిలకిస్తోంది. ఇక.. నరేంద్ర మోదీ స్టేడియం అయితే ఈ మ్యాచ్ కోసం కిక్కిరిసిపోయింది. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఈ మ్యాచ్ చూడటానికి జనాలు అహ్మదాబాద్ వెళ్లారు. అసలే దాయాదుల పోరు. 1992 నుంచి ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో భారత్ ను పాకిస్థాన్ ఓడించలేదు. అందుకే ఈ మ్యాచ్ కు అంత ప్రాధాన్యత. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు కాసేపు బాలీవుడ్ సెలబ్రిటీలు స్టేడియంలో ఆడిపాడారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది