Ravindra Jadeja : వరుస ఓటములతో డీలా పడ్డ రవీంద్ర జడేజా .. ఓటమిపై స్పందన ఏంటంటే..!
Ravindra Jadeja : గత సీజన్‌లో టైటిల్‌ని ముద్దాడిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో వరుస ఓటములతో సతమతం అవుతుంది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడగా, మూడింట పరాజయం పాలైంది. చెన్నై సూపర్ కింగ్స్ కొత్త సారథిగా పగ్గాలు చేపట్టిన రవీంద్ర జడేజా..ఓటముల తర్వాత మాట్లాడుతూ.. కెప్టెన్ గా తాను ఒత్తిడిని ఎదుర్కోవడం లేదని స్పష్టం చేశాడు. ఐపీఎల్ లో మూడు వరుస ఓటముల నేపథ్యంలో జడేజాకు ఈ ప్రశ్న ఎదురైంది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వ బాధ్యతలను విడిచిపెట్టాలని నిర్ణయించుకోవడంతో కొత్త బాధ్యతలను చేపట్టేందుకు తాను మానసికంగా సన్నద్ధమైనట్టు చెప్పాడు.మేము పవర్ ప్లే చాలా వికెట్ల్ కోల్పోయాం. తొలి బంతి నుంచే పరుగులు సాధించడంలో వెనకపడ్డాం. బలం పుంజుకోవడానికి దారి కనుక్కోవాలని” జడేజా చెప్పాడు.
అలాగే శివం దూబేపై జడేజా ప్రశంసలు కురించాడు. దూబే వరుసగా అర్థ సెంచరీలు చేశాడని… దూబే చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడని అన్నాడు. మేము తిరిగి పుంజుకోవడానికి కృషి చేస్తామని చెప్పాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ధోనీ తనకు కొన్ని నెలల ముందే చెప్పాడని జడేజా వెల్లడించాడు. కాకపోతే ఐపీఎల్ ఆరంభానికి రెండు రోజుల ముందు అధికారిక ప్రకటన వెలువడింది.కెప్టెన్సీ బాధ్యతల్లోకి రాక ముందు జడేజా బ్యాట్ తో, బాల్ తో మంచి ప్రదర్శన కనబరిచాడు. కానీ, సీఎస్కే కెప్టెన్ అయిన తర్వాత నుంచి ఐపీఎల్ లో తడబడుతున్నట్టు కనిపిస్తోంది. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో డకౌట్ కావడం తెలిసిందే. అయితే నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. సహజసిద్ధంగా ఉండాలనుకుంటున్నాను.
Ravindra Jadeja : విజయం వరించనుందా?
నా మనసులో వచ్చిన ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాలని అనుకుంటున్నాను’’ అని జడేజా చెప్పాడు.అటూ పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తన సహచరులను ప్రశంసించారు.” లివింగ్‌స్టోన్‌తో నేను ఏమీ మాట్లాడలేదు. అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అందరూ ఊపిరి పీల్చుకుంటారు” అని అగర్వాల్ చెప్పాడు. 21 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టిన వైభవ్ అరోరాపై కూడా మయాంక్ ప్రశంసలు కురిపించాడు. “వైభవ్ కొన్ని సంవత్సరాల క్రితం మాతో ఉన్నాడు. మేము ప్రతిభను చూశాము. జితేష్ శర్మను తీసుకోవడానికి అనిల్ కుంబ్లే కన్ను కారణమని అగర్వాల్ పేర్కొన్నాడు. పంజాబ్ కింగ్స్ అత్యంత ఖరీదైన ధరకు కొనుగోలు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్ ఈ మ్యాచ్‌లో 32 బంతుల్లో 60 పరుగులు చేశాడు.” నేను కష్టపడి స్వింగ్ చేస్తున్నాను.” అని లివింగ్‌స్టోన్ అన్నాడు. .