Rishabh Pant : అద్భుత‌మైన క్యాచ్ ప‌ట్టి గార్ల్ ఫ్రెండ్ ముందు మంచి మార్కులు కొట్టేసిన రిషభ్ పంత్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rishabh Pant : అద్భుత‌మైన క్యాచ్ ప‌ట్టి గార్ల్ ఫ్రెండ్ ముందు మంచి మార్కులు కొట్టేసిన రిషభ్ పంత్

 Authored By sandeep | The Telugu News | Updated on :29 April 2022,2:00 pm

Rishabh pant : ఐపీఎల్‌లో అద్భుత‌మైన క్యాచ్‌లు, మైమ‌ర‌చిపోయేలా ఆట‌గాళ్ల బ్యాటింగ్ చూస్తూ థ్రిల్ అవుతున్న విష‌యం తెలిసిందే. గురువారం రాత్రి కోల్ కతా నైట్ రైడర్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడిన సంగతి తెలిందే. ఈ మ్యాచ్ లో రిషభ్ పంత్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల తేడాతో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని కేకేఆర్ పై ఘనవిజయం సాధించిన సంగతి తెలిందే. అయితే ఈ మ్యాచ్ ద్వారా రిషభ్ పంత్ తన గర్ల్ ఫ్రెండ్ ముందు హీరో అయ్యాడు. అద్భుత‌మైన క్యాచ్ ప‌ట్టి శ్రేయాస్ అయ్య‌ర్‌ని వెన‌క్కి పంపి గార్ల్ ఫ్రెండ్ ముందు కాలర్ ఎగ‌రేశాడు.

మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడటానికి వచ్చిన గర్ల్ ఫ్రెండ్ ఇషా నెగి కూడా పంత్ క్యాచ్‌కి ఫిదా అయింది.ఈ మ్యాచ్ లో ఉమేశ్ యాదవ్ కూడా సూపర్ క్యాచ్ అందుకుని ఔరా అనిపించాడు. ఇది రిటర్న్ క్యాచ్ కావడం విశేషం. అందులోనూ ఉమేశ్ యాదవ్ లాంటి ఫాస్ట్ బౌలర్ రిటర్న్ క్యాచ్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే క్రికెట్ లో ఫాస్ట్ బౌలర్ల రన్నప్ చాలా ఎక్కువగా ఉంటుంది. తొలి బంతిని లెగ్ సైడ్ వేయగా.. స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న పృథ్వీ షా ఆ బంతిని ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్ కు తగిలి ఉమేశ్ యాదవ్ ఎడమ పక్క నుంచి వెళ్లింది.

rishabh pant stunning catch

rishabh pant stunning catch

Rishabh Pant : పంత్ అద‌ర‌గొట్టాడు..

రెప్పపాటులో తనను తాను నియంత్రించుకున్న ఉమేశ్ యాదవ్.. ఎడమ వైపునుకు డైవ్ చేస్తూ గాల్లోనే అద్భుత క్యాచ్ ను అందుకున్నాడు. ఉమేశ్ యాదవ్ క్యాచ్ తో షాక్ కు గురైన పృథ్వీ షా కాసేపు అలానే చూస్తూ ఉండిపోయాడు. ఈ క్యాచ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్ లో ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు తీశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసింది. నితీశ్ రాణా (34 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (37 బంతుల్లో 42; 4 ఫోర్లు) రాణించారు. కుల్దీప్ యాదవ్ మరోసారి 4 వికెట్లతో సత్తా చాటాడు.

 

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది