Rohit Sharma : రోహిత్ శర్మకి ఇష్టం లేకపోయిన కూడా హార్ధిక్ పాండ్యాని టీంలో ఎంపిక చేశారా..!
Rohit Sharma : ఐపీఎల్‌లో రోహిత్ శర్మని కాదని ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యాని ఎంపిక చేయడం ఎంత పెద్ద రచ్చగా మారిందో మనం చూశాం. హార్ధిక్‌ని ఓ రేంజ్‌లో విమర్శించారు. దారుణంగా తిట్టిపోశారు. ఆ సమయంలో రోహిత్ సైలెంట్‌గా ఉన్నారు.అయితే ఇప్పుడు రోహిత్, హార్ధిక్ పాండ్యాకి సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. జూన్ 2 నుంచి వెస్టిండీస్, అమెరికా వేదికగా టీ20 వరల్డ్ కప్ 2024 ప్రారంభం కానుండగా, ఈ టోర్నీ కోసం […]
ప్రధానాంశాలు:
Rohit Sharma : రోహిత్ శర్మకి ఇష్టం లేకపోయిన కూడా హార్ధిక్ పాండ్యాని టీంలో ఎంపిక చేశారా..!
Rohit Sharma : ఐపీఎల్‌లో రోహిత్ శర్మని కాదని ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యాని ఎంపిక చేయడం ఎంత పెద్ద రచ్చగా మారిందో మనం చూశాం. హార్ధిక్‌ని ఓ రేంజ్‌లో విమర్శించారు. దారుణంగా తిట్టిపోశారు. ఆ సమయంలో రోహిత్ సైలెంట్‌గా ఉన్నారు.అయితే ఇప్పుడు రోహిత్, హార్ధిక్ పాండ్యాకి సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. జూన్ 2 నుంచి వెస్టిండీస్, అమెరికా వేదికగా టీ20 వరల్డ్ కప్ 2024 ప్రారంభం కానుండగా, ఈ టోర్నీ కోసం ఇప్పటికే భారత సెలెక్టర్లు 15 మందితో కూడిన టీ20 స్క్వౌడ్‌ను ప్రకటించారు. అయితే.. ఈ టీమ్‌లో హార్దిక్ పాండ్యా అవసరం లేదని రోహిత్ శర్మ ఒత్తిడి తెచ్చాడనే సంచలన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
Rohit Sharma పాండ్యాను వద్దన్న రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న హార్దిక్ ఈ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయాడు. 13 మ్యాచుల్లో అతను 144 స్ట్రయిక్ రేటుతో 200 రన్స్ చేశాడు. 11 వికెట్లు కూడా తీసుకున్నాడు. అయితే ఒత్తిడిలోనే హార్దిక్ పాండ్యాను టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసినట్లు మీడియా రిపోర్టు పేర్కొన్నది. ఇక టీ20 వరల్డ్‌కప్ తర్వాత రోహిత్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశాలు ఉన్నట్లు కూడా వెల్లడించింది. ఫామ్‌లో లేకున్నా హార్దిక్‌ను ఎందుకు ఎంపిక చేశారన్న ప్రశ్నలకు ఓ మీడియా సమావేశంలో అగార్కర్ సమాధానం ఇస్తూ.. హార్దిక్ లాంటి ట్యాలెంట్ ఆటగాడి స్థానంలో మరో ప్లేయర్‌ను తీసుకునే ఛాన్స్ సెలక్షన్ కమిటీకి దక్కలేదని పేర్కొన్నారు.
గుజరాత్ టీమ్ నుంచి ముంబైలోకి తిరిగి వచ్చిన పాండ్యాకు ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ కెప్టెన్సీ అప్పగించడంతో అతనిపై రోహిత్ ఆగ్రహంగా ఉన్నాడు. పైగా పాండ్యా ఫామ్‌లో లేకపోవడంతో.. అతన్ని టీమ్‌లోకి తీసుకోకూడదని రోహిత్ భావించినట్లు సమాచారం. అయిన కూడా తప్పని పరిస్థితులలో హార్ధిక్‌ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా హార్దిక్‌ను టీ20 జట్టు కెప్టెన్‌గా చేయాలనుకొంటున్న బీసీసీఐ.. అతను టీమ్‌లో కచ్చితంగా ఉండాల్సిందేనని ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తోంది.