Indian Cricket Players : భారత దేశ క్రికెట్ లోనే అత్యంత దురదృష్ట ప్లేయర్స్ వీళ్ళే ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Indian Cricket Players : భారత దేశ క్రికెట్ లోనే అత్యంత దురదృష్ట ప్లేయర్స్ వీళ్ళే !

Indian Cricket Players : భారతదేశంలో సినిమా హీరోలకు దీటుగా క్రికెట్ ప్లేయర్స్ కి క్రేజ్ ఉంటుంది. అంతగా భారతదేశంలో క్రికెట్ నీ అభిమానిస్తారు. ఈ క్రమంలో చాలామంది భారత్ క్రికెట్ జట్టులో రాణించటానికి తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు. ఎంతో టాలెంట్ ఉంటే తప్ప ఇండియన్ టీంలో చోటు సంపాదించుకోలేరు. అయితే కొంతమంది చోటు దక్కించుకున్న గాని… దురదృష్టం వెంటాడి.. కెరియర్ బాగానే ఉన్నా అర్థంతరంగా జట్టులో నుంచి స్థానం కోల్పోయిన ప్లేయర్స్ కూడా ఉన్నారు. ప్రతిభ […]

 Authored By sekhar | The Telugu News | Updated on :21 April 2023,4:00 pm

Indian Cricket Players : భారతదేశంలో సినిమా హీరోలకు దీటుగా క్రికెట్ ప్లేయర్స్ కి క్రేజ్ ఉంటుంది. అంతగా భారతదేశంలో క్రికెట్ నీ అభిమానిస్తారు. ఈ క్రమంలో చాలామంది భారత్ క్రికెట్ జట్టులో రాణించటానికి తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు. ఎంతో టాలెంట్ ఉంటే తప్ప ఇండియన్ టీంలో చోటు సంపాదించుకోలేరు. అయితే కొంతమంది చోటు దక్కించుకున్న గాని… దురదృష్టం వెంటాడి.. కెరియర్ బాగానే ఉన్నా అర్థంతరంగా జట్టులో నుంచి స్థానం కోల్పోయిన ప్లేయర్స్ కూడా ఉన్నారు. ప్రతిభ ఉన్నప్పటికీ.. ఎదగలేక జట్టులో స్థానం కోల్పోయిన ఐదుగురు లెజెండరీ క్రికెటర్ ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1. అంబాటి రాయుడు :  2019 ప్రపంచ కప్ కు ముందు జరిగిన మ్యాచ్ లలో అద్భుతంగా రాణించాడు. కానీ ఆ తర్వాత సెలక్టర్లు త్రీడి ఆటగాడికి ప్రాధాన్య ఇస్తూ… రాయుడిని జట్టు నుంచి సడన్ గా తొలగించడం జరిగింది. ప్రపంచ కప్పులో ఆటగాళ్లకు గాయపడిన గాని స్టాండ్ బై గా ఉన్న రాయుడిని జట్టులోకి ఏమాత్రం తీసుకోలేదు. ఈ పరిణామంతో అంబాటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలకడం జరిగింది.

These are the most unlucky players in Indian cricket

These are the most unlucky players in Indian cricket

కరుణ్ నాయర్ : 2016వ సంవత్సరంలో ఇంగ్లాండ్ జట్టుపై త్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడు. ఇండియన్ టీంలో వీరేంద్ర సహాబాల తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడుగా రికార్డు సృష్టించాడు. దీంతో నాయర్ పేరు మారుమరోగింది. కానీ గమ్మత్తు ఏమిటంటే ఆ తర్వాత సెలక్టర్లు మనవడిని పక్కన పెట్టేశారు. త్రిపుల్ సెంచరీ చేసిన ట్రాక్ రికార్డు చూసి కూడా జట్టులోకి రాణించలేదు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరగలేదు.

వసీం జాఫర్ : ఇండియన్ క్రికెట్ టీమ్ లో ది లెజెండ్ ఆఫ్ డొమెస్టిక్ క్రికెట్ ప్లేయర్ గా పేరు సంపాదించాడు. ముంబైకి ఆడుతున్న సమయంలో ఫస్ట్ క్లాస్ కెరీర్ లో అత్యధికమైన పరుగులు చేసిన ఆటగాడుగా రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. చాలా సందర్భాలలో భారత్ క్రికెట్ టీమ్ లో క్రిజ్ లో నిలబడ్డాడు. అద్భుతమైన టెక్నిక్ బ్యాటింగ్ కలిగిన ఈ ప్లేయర్..నీ సెలెక్టర్లు.. అతని ఆటకి తగ్గ రీతిలో జట్టులో స్థానం కల్పించకుండా తీసేయడం జరిగింది.

Irfan Pathan Tweets in Favour of Wasim Jaffer, Says, 'Unfortunate That You  Have To Explain This' | LatestLY

ఇర్ఫాన్ పఠాన్ : ఎడమ చేతి వాటం కలిగిన ఈ బౌలర్ స్టార్టింగ్ లోనే దుమ్ము దులిపాడు. 23 ఏళ్ల వయసులో ఇండియన్ టీం లో అరంగేట్రం చేసి మూడు ఫార్మేట్ లలో రాణించి జూనియర్ కపిల్ దేవ్ గా పేరు సంపాదించాడు. అద్భుతమైన స్వింగ్ బౌలింగ్ తో బ్యాట్స్మెన్ లను ముప్పు తిప్పలు పెట్టేవాడు. ఇండియన్ కోచ్ గ్రేగ్ చాపల్.. తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇర్ఫాన్ పఠాన్ కెరియర్ పూర్తిగా డేంజర్ జోన్ లో పడింది. ఇండియన్ టీం కి మంచి బౌలింగ్ వేసే ఈ ఆటగాడిని ఆల్ రౌండర్ గా తీర్చిదిద్దాలని.. గ్రేగ్ చాపల్ చేసిన ప్రయోగం అట్టర్ ప్లాప్ అయ్యింది. దీంతో ఆటు బౌలింగ్ చేయలేక ఇటు బ్యాటింగ్ సరిగ్గా ఆడలేక..పఠాన్ జట్టులో రాణించలేక స్థానం కోల్పోయాడు.

దినేష్ కార్తీక్ : భారత్ క్రికెట్ జట్టులో వికెట్ కీపర్ గా దినేష్ కార్తీక్ అద్భుతమైన సేవలు అందించాడు. కానీ కెరియర్ స్టార్టింగ్ లో పెద్దగా రాణించలేకపోయాడు. వయసులో ఉన్నప్పుడు అనేకమైన పరాజయాలు ఎదుర్కొన్నాడు. పైగా ధోని వికెట్ కీపర్ గా ఉండటంతో… టీంలో పెద్దగా రాణించలేకపోయాడు. ఎప్పుడైతే ధోని జట్టు నుంచి వైదొలిగాడో… దినేష్ కార్తీక్ రాణించటం జరిగింది. కానీ అప్పటికే ఏజ్ ఎక్కువ కావడంతో మనవడికి దురదృష్టం వెంటాడి ప్రస్తుతం జట్టులో స్థానం సంపాదించలేక.. అనేక రీతులుగా కెరియర్ పరంగా సతమతమవుతున్నాడు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది