Banda Prakash : శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా నేడు బండా ప్రకాష్ నామినేషన్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Banda Prakash : శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా నేడు బండా ప్రకాష్ నామినేషన్..!!

Banda Prakash : తెలంగాణ Telangana శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి గురువారం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ KCR తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా బండా ప్రకాష్ Banda Prakash పేరును ఖరారు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బండా ప్రకాష్ ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్న 12 గంటల వరకు అసెంబ్లీ ఛాంబర్ లో నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. ఈ […]

 Authored By sekhar | The Telugu News | Updated on :11 February 2023,11:44 am

Banda Prakash : తెలంగాణ Telangana శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి గురువారం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ KCR తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా బండా ప్రకాష్ Banda Prakash పేరును ఖరారు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బండా ప్రకాష్ ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్న 12 గంటల వరకు అసెంబ్లీ ఛాంబర్ లో నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. ఈ క్రమంలో బండ ప్రకాష్ నామినేషన్ కీ సంబంధించిన అవసరమైన ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.

banda prakash nomination as deputy chairman of legislative council today

banda prakash nomination as deputy chairman of legislative council today

కౌన్సిల్ లో అధికార పార్టీ బీఆర్ఎస్ బలం బట్టి చూస్తే ఈ పదవికి బండ ప్రకాష్ ఎన్నికలన్చనమే అని పార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. 1981లో రాజకీయాల్లో అడుగుపెట్టిన బండ ప్రకాష్.. అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు. 30కి పైగా పొలిటికల్ కెరియర్ లో అనేక పదవులు అధిరోహించారు. 2017 లో టిఆర్ఎస్ పార్టీలో చేరిన డాక్టర్ బండా ప్రకాష్.. పార్టీలో నిబద్ధత కలిగిన నేతగా రాణించటంతో ఆయనను కేసీఆర్ ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత 2018 మార్చి 23వ తారీఖున పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు.

ఆ తర్వాత పార్టీ తరపున అనేక పదవులలో రాణించి 2021 లో జరిగిన ఎన్నికలలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో…బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు అయి నవంబర్ 22వ తారీఖున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. డిసెంబర్ లో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో 12న జరిగే శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం బండా ప్రకాష్ పేరును ఖరారు చేయడం జరిగింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది