Konda Surekha : కొండా సురేఖ‌పై సినీ ప‌రిశ్ర‌మ గ‌రం గ‌రం.. కాంగ్రెస్‌కు మరో డ్యామేజీ…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Konda Surekha : కొండా సురేఖ‌పై సినీ ప‌రిశ్ర‌మ గ‌రం గ‌రం.. కాంగ్రెస్‌కు మరో డ్యామేజీ…!

Konda Surekha : కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. సమంత , అక్కినేని ఫ్యామిలీ గురించి కొండా సురేఖ చేసిన ఆరోపణలను సినీ ప్రముఖులు ఖండిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్, వెంకటేష్ తో సహా చాలా మంది కొండా సురేఖ కామెంట్స్ పై స్పందించారు. మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపనున్నారు అక్కినేని నాగార్జున. ప్రస్తుతం వైజాగ్‌లో ఉన్నానని, హైదరాబాద్ రాగానే చట్టపరంగా నోటీసులు […]

 Authored By ramu | The Telugu News | Updated on :3 October 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Konda Surekha : కొండా సురేఖ‌పై సినీ ప‌రిశ్ర‌మ గ‌రం గ‌రం.. మౌనంగా చూస్తూ కూర్చోమంటూ ఎన్టీఆర్ ఫైర్..!

Konda Surekha : కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. సమంత , అక్కినేని ఫ్యామిలీ గురించి కొండా సురేఖ చేసిన ఆరోపణలను సినీ ప్రముఖులు ఖండిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్, వెంకటేష్ తో సహా చాలా మంది కొండా సురేఖ కామెంట్స్ పై స్పందించారు. మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపనున్నారు అక్కినేని నాగార్జున. ప్రస్తుతం వైజాగ్‌లో ఉన్నానని, హైదరాబాద్ రాగానే చట్టపరంగా నోటీసులు పంపిస్తామని నాగ్ తెలిపారు. కొండా సురేఖ విషయం పై ఎట్టి పరిస్థితుల్లో దీనిపై ఊరుకునేది లేదు.. చట్టపరంగా పోరాడతానని నాగార్జున తెలిపారు.

Konda Surekha కొండాపై గ‌రం గ‌రం..

ఇక ఈ ఇష్యూపై ఖుష్బూ స్పందిస్తూ..సినీ పరిశ్రమ ఇలాంటి వేధింపులను సహించదు..చాలు. మీరు ఓ మహిళగా ఉండి.. మరొక మహిళపై ఇలాంటి నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేసినందుకు మొత్తం సినీ పరిశ్రమకు క్షమాపణ చెప్పాలి అని అన్నారు.మంత్రి కొండా సురేఖ గారూ మీ నీచమైన, స్త్రీ ద్వేషపూరిత వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. సినీ ప్రముఖులను రాజకీయ పావులుగా వాడుకోవడం మీ నిరాశను తెలియజేస్తుంది. మీరు కేవలం మహిళలను మాత్రమే అవమానించడం కాదు.. తెలంగాణకు గర్వకారణమైన మొత్తం పరిశ్రమను అగౌరవపరిచారు అని అన్నారు.వ్యక్తిగత పరిస్థితులను రాజకీయ మందుగుండులా వాడుకోవడం నాకు చాలా బాధ కలిగించింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వారి వ్యక్తిగత విషయాన్ని రాజకీయ లబ్ధి కోసం ఆయుధంగా మార్చడం దురదృష్టకరం. పబ్లిక్‌గా మాట్లాడేటప్పుడు గౌరవాన్ని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని వెంక‌టేష్ అన్నారు.

Konda Surekha కొండా సురేఖ‌పై సినీ ప‌రిశ్ర‌మ గ‌రం గ‌రం కాంగ్రెస్‌కు మరో డ్యామేజీ

Konda Surekha : కొండా సురేఖ‌పై సినీ ప‌రిశ్ర‌మ గ‌రం గ‌రం.. కాంగ్రెస్‌కు మరో డ్యామేజీ…!

గౌరవప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలా నిరాధారమైన కామెంట్స్‌ చేయడం సరైంది కాదు. మన సమాజాన్ని చెడుగా ప్రతిబింబించే ఇలాంటి ఆచారాన్ని మనందరం ఖండించాలి అని నాని అన్నారు.సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు, సినీ సోదరుల సభ్యులను టార్గెట్‌ చేయడం సిగ్గు చేటు. మా సభ్యులపై ఇలాంటి దుర్మార్గపూరిత మాటల దాడులను చిత్రపరిశ్రమ తరపున అంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తాం. రాజకీయ నేతలు ఎవరూ ఈ స్థాయికి దిగజారకూడదు అని చిరంజీవి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కొండా సురేఖ వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లోకి లాగడం దిగజారుడు తనానికి నిదర్శనం. ప్రజా జీవితంలో ఉన్న ఆమె గౌరవంగా ప్రవర్తించాలి. సినీ పరిశ్రమలోని ప్రముఖులపై నిరాధార వ్యాఖ్యలు చేయడం నిజంగా బాధాకరం. హద్దులు దాటి ప్రవర్తించడం ఎవరికీ మంచిది కాదు. నిర్లక్ష్య పూరిత ప్రవర్తన రాజకీయ జీవిత సమాధికి కారణం అవుతుంది అని ఎన్టీఆర్ హెచ్చరించారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది