Konda Surekha : నాగ‌చైత‌న్య‌, స‌మంత విడిపోవ‌డానికి కేటీఆర్ కార‌ణం.. మంత్రి కొండా సురేఖ సంచ‌ల‌న ఆరోప‌ణ‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Konda Surekha : నాగ‌చైత‌న్య‌, స‌మంత విడిపోవ‌డానికి కేటీఆర్ కార‌ణం.. మంత్రి కొండా సురేఖ సంచ‌ల‌న ఆరోప‌ణ‌

Konda Surekha : హీరో నాగచైతన్య, హీరోయిన్‌ సమంత దంప‌తులు విడిపోవడానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిండెంట్‌ కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చాలా మంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని విడిపోవడానికి, త్వ‌ర‌గా పెండ్లి చేసుకోవ‌డానికి కూడా కేటీఆర్ కారణమని ఆమె అన్నారు. తనపై ఇటీవల బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ చేశారని పేర్కొంటూ మంత్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అదే సమయంలో […]

 Authored By ramu | The Telugu News | Updated on :3 October 2024,11:45 am

ప్రధానాంశాలు:

  •  Konda Surekha : నాగ‌చైత‌న్య‌, స‌మంత విడిపోవ‌డానికి కేటీఆర్ కార‌ణం.. మంత్రి కొండా సురేఖ సంచ‌ల‌న ఆరోప‌ణ‌

Konda Surekha : హీరో నాగచైతన్య, హీరోయిన్‌ సమంత దంప‌తులు విడిపోవడానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిండెంట్‌ కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చాలా మంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని విడిపోవడానికి, త్వ‌ర‌గా పెండ్లి చేసుకోవ‌డానికి కూడా కేటీఆర్ కారణమని ఆమె అన్నారు. తనపై ఇటీవల బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ చేశారని పేర్కొంటూ మంత్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అదే సమయంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 ఏళ్లలో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ సెంటర్‌ను కూల్చివేయలేదని చెప్పిన కొండా సురేఖ దానికి కారణం కేటీఆర్ పెట్టిన ష‌ర‌తే కార‌ణ‌మని తెలిపారు. అయితే అప్పుడు అక్కినేని నాగార్జున కోడలు, నాగచైతన్య భార్య సమంత విషయంలో కేటీఆర్ షరతు పెట్టినట్లు ఆమె చెప్పారు. ఆ కండీషన్‌కు ఒప్పుకుంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత ఆపుతామని చెప్పారని, ఆ విషయంలో అక్కినేని కుటుంబం కూడా సమంతపై ఒత్తిడి తీసుకువచ్చిందని పేర్కొన్నారు. నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆర్ కారణమని చెప్పారు.

Konda Surekha నాగ‌చైత‌న్య‌ స‌మంత విడిపోవ‌డానికి కేటీఆర్ కార‌ణం మంత్రి కొండా సురేఖ సంచ‌ల‌న ఆరోప‌ణ‌

Konda Surekha : నాగ‌చైత‌న్య‌, స‌మంత విడిపోవ‌డానికి కేటీఆర్ కార‌ణం.. మంత్రి కొండా సురేఖ సంచ‌ల‌న ఆరోప‌ణ‌

కేటీఆర్ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని, వారికి డ్రగ్స్ అలవాటు చేసి వారి జీవితాలు నాశనం చేశారన్నారు. ఈ విషయం టాలీవుడ్‌లోని పెద్దలందరికీ తెలుసన్నారు. మంత్రి వ్యాఖ్యలు ప్రస్తుతం ఇటు టాలీవుడ్‌లోనూ, అటు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. త‌న ఆరోప‌ణ‌ల‌కు సంబంధించిన కాల్ రికార్డింగ్‌లు కూడా ఉన్నాయంటూ ఆమె పేర్కొన్నారు.మహిళనైన తనపై అసభ్యకర పోస్టులు పెట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీకి చెందిన హరీశ్ రావు ఖండించారన్న ఆమె కేటీఆర్ మాత్రం సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గతంలో మేయర్ విజయలక్ష్మీ, మంత్రి సీతక్కపై కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టిన విష‌యాన్ని ఆమె ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది