Barrelakka Sirisha : నన్ను గెలిపిస్తే కేసీఆర్ తాతతో కోట్లాడి 5000 కోట్లు తీసుకొస్తా.. బర్రెలక్క
ప్రధానాంశాలు:
Barrelakka Sirisha : నన్ను గెలిపిస్తే కేసీఆర్ తాతతో కోట్లాడి 5000 కోట్లు తీసుకొస్తా.. బర్రెలక్క
Barrelakka Sirisha : ఇప్పుడు రెండు రాష్ట్రాలలో బర్రెలక్క అలియాస్ శిరీష Barrelakka Sirisha చర్చనీయాంశంగా మారారు. కొల్లాపూర్ నియోజక వర్గం kollapur assembly constituency నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన బర్రెలక్క తన శైలిలో ప్రచారం చేస్తూ దూసుకెళుతున్నారు. ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి సపోర్ట్ లభిస్తుంది. కొల్లాపూర్ లోని ప్రతి గ్రామానికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. అక్కడ వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తా అని బర్రెలక్క ప్రజలకు విన్నవించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బర్రెలక్క కొల్లాపూర్ లోని ఓ గ్రామానికి ప్రచారం నిర్వహించేందుకు వెళ్లారు. అక్కడ తన విజిల్ గుర్తుకు ఓటు వేయాలని గ్రామ ప్రజలను కోరారు.
ఇంకా మాట్లాడుతూ.. ఈ ఊర్లో 4,500 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లన్ని నాకే పడాలి. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా. మీరందరూ ఎందరికో లైఫ్ ఇచ్చారు. నాకు ఈ ఒక్కసారి ఇవ్వండి మీకు కష్టం అంటే ఏంటో తెలియకుండా చూసుకుంటాను. నవంబర్ 30 తర్వాత భారతదేశం కన్ను మొత్తం బర్రెలక్క మీదే పడాలి. నన్ను గెలిపిస్తే మీరంతా గెలిచినట్టు, కొల్లాపూర్ గెలిచినట్లు. కొంతమంది నేను గెలిస్తే పింఛన్ రాదేమో అని భయపడుతున్నారు. మనకు పింఛన్ 2000 కాదు రావాల్సింది, మనకు 2000 ఇచ్చి వాళ్లు 200 కోట్లు దొబ్బేస్తున్నారు. ఏ పార్టీ నిలబడ్డా, స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డా మనకు 5 సంవత్సరాలకి 5000 కోట్లు వస్తాయి. ఒక్క గ్రామానికి రెండు కోట్లు చాలవా. అది ఇప్పించే బాధ్యత నాది.
365 రోజుల్లో రోజుకొక గ్రామానికి తిరిగి మీ సమస్యలను పరిష్కరిస్తాను. ఎనిమిదో నెంబరు ఈల గుర్తుకు ఓటి వేయండి అని అన్నారు. యువత రాజకీయాలలోకి రావాలి. నిరుద్యోగ సమస్యలను ఎదుర్కోవాలి అని హితవు పలికారు .ఇక బర్రెలక్క మాటలకు అక్కడే ఉన్న ఓ పెద్దావిడ చేతులెత్తి దండం పెట్టారు. ఒక ఆడపిల్ల అయి ఉండి ఇలా ధైర్యంగా రాజకీయాలలోకి వచ్చి ఎన్ని అడ్డంకులు వచ్చిన ఎదుర్కొని ధైర్యంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది. ఇక ఎలక్షన్స్ నవంబర్ 30న శుక్రవారం జరగనున్నాయి. డిసెంబర్ 3 తో కొల్లాపూర్ భవిష్యత్ ఏ పార్టీ చేతిలో ఉంటుందో తెలుస్తుంది. ఇప్పటిదాకా అయితే కొల్లాపూర్ నియోజక వర్గంలో బర్రెలక్క గెలుపు ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.