KCR : తెలంగాణ రాష్ట్రంలో రెండు పట్టబద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గాల ఎన్నికల్లో ఎవరి అంచనాలు వారివి అన్నట్లుగా ఉన్నాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఎలాంటి డౌట్ లేకుండా టీఆర్‌ఎస్ గెలుచుకుంటుంది అంటూ కేసీఆర్ వర్గం ధీమాగా ఉంది. మరో వైపు ఇతర పార్టీల నాయకులు మరియు పోటీ చేసిన వారు కూడా కేసీఆర్ కు షాక్ తప్పదు అంటున్నారు. టీఆర్‌ఎస్ కు గట్టి బుద్ది చెప్పినట్లుగా పట్టబద్రులు ఓట్లు వేశారంటూ విపక్ష పార్టీల నాయకులు మరియు ఇండిపెండెంట్ గా పోటి చేసిన వారు కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఒక చోట తప్పితే మరో చోట అయినా షాక్ తప్పదని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. ఈ సమయంలో ఒక సర్వే ఫలితం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజక వర్గం నుండి పోటీ చేసిన టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి పై కేసీఆర్ చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ ఎన్నికల్లో పల్లా కోసం పదుల సంఖ్యలో టీఆర్‌ఎస్ నాయకులు మరియు వేలల్లో కార్యకర్తలు ప్రచారం చేశారు. పెద్ద ఎత్తున డబ్బును కూడా పల్లా ఖర్చు చేశారని అంటున్నారు. అయినా కూడా పల్లా విజయ అవకాశాలను తీన్మార్ మల్లన్న తీవ్రంగా ప్రభావితం చేసినట్లుగా చెబుతున్నారు. పోటీ అనేది పల్లా మరియు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న మద్య ఉందని అంటున్నారు. కోదండరామ్ సారు కూడా పోటీ చేసినా కూడా జనాలు ఆయన్ను పెద్దగా పట్టించుకోలేదని చెబుతున్నారు.
సోషల్ మీడియాలో తీన్మార్ మల్లన్న చేసిన ప్రచారం మరియు అన్ని జిల్లాలను కవర్ చేసి ప్రచారం చేసిన తీరు పట్టభద్రులను ఆకట్టుకుందట. అందుకే పల్లా రాజేశ్వర్ రెడ్డికి మల్లన్న గట్టి పోటీ ఇవ్వడంతో పాటు కేసీఆర్ కు షాక్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొదటి నుండి కేసీఆర్ మరియు కేటీఆర్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ టీఆర్‌ఎస్ పార్టీని ఇరుకున పెడుతూ వస్తున్న తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తే సంచలనమే. కేసీఆర్ కు ఇది గట్టి చెంప పెట్టు అన్నట్లుగా సోషల్ మీడియా జనాలు అంటున్నారు. ఒక వేళ తీన్మార్ మల్లన్న గెలువకపోయినా నెం.2 గా నిలిచినా కూడా కేసీఆర్ పై ఆయన విజయాన్ని సొంతం చేసుకున్నట్లే అంటున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.