Lock Down : తెలంగాణలో రేపటి నుంచి లాక్డౌన్ ఎత్తివేత.. ఫస్ట్ తారీఖు నుంచి స్కూళ్లు, కాలేజీలు..!
Lock Down : కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో విధించిన లాక్డౌన్ ని రేపు ఆదివారం నుంచి పూర్తి స్థాయిలో ఎత్తివేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మంత్రివర్గం ఇవాళ శనివారం నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ తొలగించటంతో బస్సులు, మెట్రో రైళ్లు, గవర్నమెంట్ ఆఫీసులు, దుకాణాలు గతంలో మాదిరిగా అందుబాటులో ఉంటాయి. ఫస్ట్ తారీఖు నుంచి అన్ని విద్యా సంస్థలను కూడా ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మిగతా రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. పక్క రాష్ట్రాల్లోనూ కొవిడ్ కంట్రోల్ లోకి వచ్చింది. దీంతో లాక్డౌన్ అవసరం లేదని కేబినెట్ తీర్మానించింది.
అయినా.. జాగ్రత్త సుమా.. Lock Down
లాక్డౌన్ ని రద్దు చేసినప్పటికీ ప్రజలు కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని, ఈ మేరకు మూతికి, ముక్కుకి మాస్కు కట్టుకోవాలని, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని, శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవాలని సర్కారు సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ పనులు ప్రారంభం కావటం, విద్యా సంస్థలను తెరిచే సమయం ఆసన్నం కావటం, లాక్డౌన్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. కొవిడ్ కి విరుగుడుగా టీకాల కార్యక్రమాన్ని ముమ్మరం చేయటం, పల్లెలు, పట్టణాలు, నగరాల్లో స్పెషల్ డ్రైవ్ లు పెట్టడంతో కరోనా నియంత్రణలోకి వచ్చింది. దీంతో లాక్డౌన్ మొత్తం సడలించాలని గవర్నమెంట్ ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఏడాదైనా.. : Lock Down
గతేడాది కరోనా ఫస్ట్ వేవ్ నుంచి స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు మూతపడ్డాయి. పరీక్షలు సరిగా జరగట్లేదు. టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ ని వరుసగా రెండేళ్లు రద్దు చేశారు. మధ్యలో కొన్ని రోజులు ఆన్ లైన్ క్లాసులు పెట్టారు. మొత్తమ్మీద విద్యా వ్యవస్థలో గందరగోళం అలుముకుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదైనా అకడమిక్ ఇయర్ సాఫీగా సాగుతుందా అనే అనుమానం విద్యార్థుల్లో, పేరెంట్స్ లో నెలకొంది. అందువల్ల జూలై ఒకటో తేదీ నుంచి అన్ని విద్యా సంస్థలను రెగ్యులర్ గా నడపాలని నిర్ణయించారు. పూర్తి విధివిధానాలు వెలువడాల్సి ఉంది. కరోనా మూడో వేవ్ పిల్లలపైనే అధిక ప్రభావం చూపుతుందని అంటున్నారు. దీంతో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది.