M Rajitha Parmeshwar Reddy : ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు భగాయతులో 5 ఎకరాల భూమి
M Rajitha Parmeshwar Reddy : రజితాపరమేశ్వర్ రెడ్డి M Rajitha Parmeshwar Reddy విజ్ఞప్తిపై స్పందించి మంత్రి శ్రీధర్ బాబు Sridarbabu గారు Bhagayat Uppal ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు Government Degree College ఉప్పల్ భగాయత్ లో 5 ఎకరాల భూమిని కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశించారు. భూమి కేటాయింపుల ప్రక్రియను వేగవంతం చేసి కళాశాల భవనాల నిర్మాణానికి కూడా కావాల్సిన ఏర్పాట్లను చేయాలని సూచించారు.
M Rajitha Parmeshwar Reddy సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
డిగ్రీ కళాశాలకు Government Degree College ఉప్పల్ ఖాల్సా లో సర్వే నెంబర్ 581/1 లో రెండు ఎకరాల భూమిని కేటాయించేందుకు ఇటీవల అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.ఈ సర్వే నెంబర్ లో గల భూమి వివాదాస్పదంగా ఉంది. ఇప్పటికే కోర్టు కేసులు కూడా ఈ భూమిపై ఉన్నాయి. ఇదే కాకుండా డిగ్రీ కళాశాలకు కేవలం రెండు ఎకరాల భూమిని మాత్రమే కేటాయిస్తే భవిష్యత్తులోనూ విద్యాసంస్థల ఏర్పాటుకు భూమి లభ్యత కష్టంగా మారే అవకాశం ఉంటుంది.ఇదే కాకుండా క్లియర్ టైటిల్ లేని భూమిలో విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి. డిగ్రీ కళాశాల తో పాటు ఇంటర్, ఇతర ఒకేషనల్, ఇతర కళాశాలలు, వాటి ల్యాబ్ లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
డిగ్రీ కళాశాల తో పాటు ఇంటర్, ఇతర ఒకేషనల్, ఇతర కళాశాలలు, వాటి ల్యాబ్ లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇదే కాకుండా ఉప్పల్ లో ఎడ్యుకేషన్ హబ్ గా భవిష్యత్తులో తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది.ఇదే అంశాలను ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించడంతో పాటు డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఉప్పల్ భగాయత్ లో ఐదు ఎకరాల భూమిని తక్షణమే కేటాయించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.సోమవారం ఇదే విషయమై ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో కార్పోరేటర్లు చెర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గారు ,ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి ,కాప్రా కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి గారు ,మేడ్చల్ జిల్లా కలెక్టర్ ను కలిసి కళాశాలకు సంబంధిత భూమి కేటాయింపు పై చర్చించారు. త్వరలోనే భూమి కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన తుది ఆదేశాలను అధికారులు జారీ చేయనున్నారు.