Nagarjuna Sagar : జులై నెలలో నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత.. 18 ఏళ్ల తర్వాత జరిగింది.. వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nagarjuna Sagar : జులై నెలలో నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత.. 18 ఏళ్ల తర్వాత జరిగింది.. వీడియో !

 Authored By ramu | The Telugu News | Updated on :29 July 2025,5:00 pm

ప్రధానాంశాలు:

  •  ఈసారి నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేతలో చాల ప్రత్యేకత ఉంది.. అదేంటో తెలుసా..?

  •  Nagarjuna Sagar : జులై నెలలో నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత.. 18 ఏళ్ల తర్వాత జరిగింది..!

Nagarjuna Sagar : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం మరియు నాగార్జునసాగర్ భారీ వరద నీటితో నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నది ప్రవాహం తీవ్రంగా పెరిగింది. సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో శ్రీశైలం జలాశయానికి 2,31,612 క్యూసెక్కుల వరద వచ్చిన వేళ, అధికారులు ఐదు గేట్లను ఒక్కొక్కటి 10 అడుగుల మేర పైకెత్తి, 2,01,229 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. ప్రస్తుత నీటిమట్టం 882.8 అడుగులు, నీటి నిల్వ 203.4290 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.ఇదే విధంగా నాగార్జునసాగర్ జలాశయంలో కూడా నీటి మట్టం గణనీయంగా పెరిగింది.

Nagarjuna Sagar జులై నెలలో నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత 18 ఏళ్ల తర్వాత జరిగింది వీడియో

Nagarjuna Sagar : జులై నెలలో నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత.. 18 ఏళ్ల తర్వాత జరిగింది.. వీడియో !

Nagarjuna Sagar  : 18 ఏళ్ల తర్వాత జులై నెలలో నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత..!

గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతానికి ఇది 584.41 అడుగులుకి చేరుకుంది. అలాగే గరిష్ట నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 295.7 టీఎంసీలుగా నమోదైంది. వరద తీవ్రత నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎన్.ఉత్తమ్‌కుమార్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం ఉదయం సాగర్ గేట్లను పైకి ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. గత 18 ఏళ్లలో ఇదే తొలిసారి నెలరోజుల ముందుగానే ఈ స్థాయికి నీటి నిల్వ చేరడం గమనార్హం. అప్పుడెప్పుడో 18 ఏళ్ల క్రితం జులై నెలలో గేట్లు ఎత్తగా..మళ్లీ ఇప్పుడు గేట్లు ఎత్తడం విశేషం.ప్రస్తుతం సాగర్ జలాశయం ద్వారా విద్యుదుత్పత్తి క్రమంలో 28,785 క్యూసెక్కుల నీరు తెలంగాణకు విడుదలవుతుండగా, కుడి ప్రధాన కాల్వ ద్వారా 5,394 క్యూసెక్కుల నీటిని ఆంధ్రప్రదేశ్ తీసుకుంటోంది. అలాగే ఎడమ ప్రధాన కాల్వ ద్వారా రెండు రాష్ట్రాల అవసరాలను తీర్చేందుకు మరో 6,634 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ఈ పరిస్థితిలో రైతులకు సాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం లేకుండా ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంటోంది.మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌ కలిసి సాగర్ నుంచి నీటిని అధికారికంగా విడుదల చేశారు. గేట్లు ఎత్తే ముందు కృష్ణమ్మకు పూజలు నిర్వహించి నీటిని వదిలారు. జూరాల, శ్రీశైలం నుంచి భారీగా వచ్చే వరదనీరు క్రస్ట్‌గేట్ల ద్వారా దిగువకు తరలించబడుతోంది. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు సూచించారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది