Ration Cards : తెలంగాణ కొత్త రేషన్ కార్డుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కార్
ప్రధానాంశాలు:
Ration Cards : తెలంగాణ కొత్త రేషన్ కార్డుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కార్
Ration Cards : గత కొద్ది రోజులుగా తెలంగాణ ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రేషన్ కార్డుల జారీకి అంతా రెడీ అయింది. పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రవ్యాప్తంగా మండలానికి ఓ గ్రామంలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈనెల 1 నుంచి కొత్త కార్డుల జారీకి శ్రీకారం చుట్టాలని భావించినా.. అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.

Ration Cards : తెలంగాణ కొత్త రేషన్ కార్డుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కార్
Ration Cards కొత్త ప్లాన్..
ఉగాది నుంచి కార్డులు జారీకి ముహుర్తం ఫిక్స్ చేశారు. అయితే తాజాగా.. రేషన్ కార్డుల అఫ్లికేషన్లపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మీ సేవ కేంద్రాదల ద్వార స్వీకరించిన అఫ్లికేషన్లపై సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణకు సిద్ధమయ్యారు. విచారణ బాధ్యతలను తెలంగాణ సివిల్ సప్లయ్ శాఖ అధికారులకు అప్పగించారు.
సివిల్ సప్లై అధికారులు దరఖాస్తుదారుల ఇంటింటికీ వెళ్లి… క్షేత్రస్థాయిలో అఫ్లికేషన్లు విచారించనున్నారు. ఈ విచారణలో అర్హులని తేలితే వారికి కొత్త కార్డులు మంజూరు చేయనున్నారు. ఇంట్లో ఉండే ఖరీదైన వస్తువులు, కారు, బైక్, విద్యుత్ బిల్లులు తదితర వివరాలను అధికారులు నమోదు చేస్తారు. ఇంటి యాజమాని ఫోన్ నంబర్, కుటుంబ సభ్యుల పేర్లు, వారి యెక్క నెలవారీ ఆదాయ వివరాలను సేకరిస్తారు. దరఖాస్తుదారు అందుబాటులో లేకుంటే ఫోన్ ద్వారా వివరాలు సేకరించనున్నారు.