Rs.500 Gas Cylinder : 500 కే గ్యాస్ సిలిండర్ వారికి మాత్రమే… తెల్ల రేషన్ కార్డు ఉన్న ఉపయోగం లేదు…!
ప్రధానాంశాలు:
Rs.500 Gas Cylinder : 500 కే గ్యాస్ సిలిండర్ వారికి మాత్రమే... తెల్ల రేషన్ కార్డు ఉన్న ఉపయోగం లేదు...!
Rs.500 Gas Cylinder : తెలంగాణలో ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చేపిన హామీలలో ఇప్పటికే రెండు పథకాలను అమలు చేశారు. ఇక దానిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి కాగా ఆ తర్వాత రెండో పథకంగా ఆరోగ్య శ్రీ పథకాన్ని 10 లక్షల కు పెంచడం జరిగింది. అయితే ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఈ ,ఆర్ గ్యారంటీలలో మహాలక్ష్మి పథకం ఒకటి. ఇక ఈ మహాలక్ష్మి పథకం కింద 500 కే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని రేవంత్ సర్కార్ ప్రకటించింది. ఈ పథకం కి అర్హులను ఆశ కార్యకర్తలు ఎంపిక చేస్తారని అధిష్టానం తెలియజేసింది. అయితే ఆశ కార్యకర్తలు డోర్ టు డోర్ అనే సర్వే ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి రేషన్ కార్డు మరియు ఇతర ప్రభుత్వ గుర్తింపు ధృవపత్రాలను పరిశీలించనున్నారు.
ఎవరైతే అర్హులు ఉంటారో వారి పూర్తి వివరాలను ఆశ కార్యకర్తలు నమోదు చేసుకుంటారు. అయితే ఈ పథకం అందరికీ వర్తించదని కేవలం తెల్ల రేషన్ కార్డు ఉండి గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని గతంలో పలుసార్లు అధికారులు తెలియజేసిన సంగతి తెలిసిందే . అయితే తెలంగాణలో సుమారు 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని సమాచారం. ఇక పౌర సరఫరాల శాఖ 90 లక్షల మందిలో కేవలం 64 లక్షల కార్డులకు మాత్రమే గ్యాస్ కలెక్షన్ ఉన్నట్లు తెలిపింది. ఇక మిగిలిన 26 లక్షల కార్డులకు గ్యాస్ కలెక్షన్ లేదు అని తెలిపింది. ఈ క్రమంలో 64 లక్షల కార్డు దారులకు మాత్రమే 500 గ్యాస్ పథకం వర్తిస్తుందని తెలుస్తోంది .
అంటే మిగిలిన 26 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డు ఉన్న దాని వలన ఎలాంటి ప్రయోజనం ఏమి లేదు అని అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ పథకం 26 లక్షల మందికి ఏమాత్రం ఉపయోగం ఉండదు అని చెప్పుకోవాలి. అలాగే ఈ 26 లక్షల మందికి కొత్త గ్యాస్ కలెక్షన్ తీసుకుంటే మాత్రం ఈ పథకం వర్తిస్తుంది అని తెలిపారు. కాబట్టి ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి గ్యాస్ కనెక్షన్ కలిగి లేరో వారు వెంటనే గ్యాస్ కనెక్షన్ తీసుకోవాల్సిందిగా అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి వీలైనంతమందికి ఈ సమాచారాన్ని తెలియజేయండి.