Dharani Portal : ధరణి సమస్యల పరిష్కారానికి సమగ్ర చట్టం.. సీఎం రేవంత్ రెడ్డి సూచన..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 26 July 2024, 11:55 pm
  •  Dharani Portal : ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన

  •  Dharani Portal : ధరణి సమస్యల పరిష్కారానికి సమగ్ర చట్టం.. సీఎం రేవంత్ రెడ్డి సూచన..!

Dharani Portal  :  ధరణి సమస్యలపై శాశ్వత పరిష్కారం కోసం అవసరమైతే సమగ్రమైన చట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చెప్పారు. ధరణిలో సవరణలు చేస్తున్న సందర్భంగా కొత్తగా సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ధరణి సమస్యలపై ముఖ్యమంత్రి సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. సవరణలు చేసే క్రమంలో ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.

సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని, అవసరమైతే ఈ విషయంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని, దీనిపై అసెంబ్లీలోనూ చర్చించి అందరి సూచనలు, అభిప్రాయాలకు అనుగుణంగా సమగ్రమైన చట్టం రూపొందించాలని ఆదేశించారు.

Dharani Portal : ధరణి సమస్యల పరిష్కారానికి సమగ్ర చట్టం.. సీఎం రేవంత్ రెడ్డి సూచన..!

Dharani Portal : ధరణి సమస్యల పరిష్కారానికి సమగ్ర చట్టం.. సీఎం రేవంత్ రెడ్డి సూచన..!

రెవెన్యూ శాఖామాత్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీ కే.కేశవరావు, మాజీ మంత్రి శ్రీ కుందూరు జానారెడ్డి, ధరణి కమిటీ సభ్యులు శ్రీ ఎం. కోదండరెడ్డి, శ్రీ రేమండ్ పీటర్, శ్రీ ఎం.సునీల్ కుమార్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి