Telangana Formation Day : పదేళ్ళ తరవాత వెనక్కి చూసుకుంటే.. అవతరణ తరవాత తెలంగాణ సాధించింది ఏంటి?
Telangana Formation Day : తెలంగాణ ఏర్పడి ఈరోజుకు అంటే జూన్ 2కి 10 ఏళ్లు అవుతోంది. 10 ఏళ్లు పడ్డాయి. అందుకే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈరోజు నుంచే దశాబ్ది ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసు. 2014 జూన్ 2 న తెలంగాణ ఏర్పడిన రోజు నుంచి ఇప్పుడు తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు అయిన తర్వాత 2023 లో చూసుకుంటే అభివృద్ధిలో ముందంజలో ఉందనే చెప్పుకోవాలి. కానీ.. ఇదంతా పైకి మాత్రమే. లోపల విషయాలు ఎవ్వరికీ తెలియవు. పైన పటారం లోన లొటారం అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఎంత మందికి తెలుసు.
2014 కు ముందు తెలంగాణ చాలా తక్కువ సంక్షేమ పథకాలు ఉన్నాయి. కానీ.. ఇప్పుడు తెలంగాణలో ఉన్నన్ని సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలో లేవు. ఏదో ఒక సంక్షేమ పథకం పేరుతో తెలంగాణలోని ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతోంది అంటే.. ఈ పథకాల కోసం ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి. అది కూడా ప్రజలకు ఉచితంగా డబ్బులు అందించడం కోసం.. వాళ్ల మెప్పు పొందడం కోసం ప్రభుత్వం అప్పు చేయడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. అందుకే.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.
Telangana Formation Day : తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ మరవని రోజు జూన్ 2
జూన్ 2 అనేది తెలంగాణలో ఒక చరిత్రాత్మక రోజు. నిజానికి తెలంగాణ ఉద్యమం అనేది ఒక్క ముక్కలో చెప్పేది కాదు. ఆరు దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం. ఆ ఉద్యమంలో ఎందరో ప్రాణత్యాగాలు చేయగా చివరకు 2014లో తెలంగాణ కల సాకారం అయింది. 1969 నుంచే తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయింది. కానీ.. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకుందో అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. తెలంగాణ వచ్చాక అభివృద్ధి అయితే జరిగింది కానీ.. అప్పులు మాత్రం పెరిగిపోయాయి. తెలంగాణ వచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్న అప్పు కేవలం రూ.60 వేల కోట్లు. కానీ.. ఇప్పుడు రూ.4.5 లక్షల కోట్ల అప్పు తెలంగాణ మీద ఉంది. ఈ అప్పుకు నెలకు వందల కోట్ల వడ్డీ కట్టాలి. అందుకే.. ఈ అప్పు తీర్చడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రజల నడ్డీ విరుస్తోంది.