Rationcard Holders : రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rationcard Holders : రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..!!

 Authored By anusha | The Telugu News | Updated on :31 December 2023,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Rationcard holders : రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..!!

  •  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను ప్రభుత్వం నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది.

Rationcard holders  : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను ప్రభుత్వం నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డు ను తీసుకోవాలి అని ప్రజలకు సూచించింది. రేషన్ పంపిణీలో మరింత పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ-కేవైసీ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ-కేవైసీ గడువును ప్రభుత్వం పెంచింది. రేషన్ కార్డ్ లబ్ధిదారులు జనవరి 31వ తేదీ లోపు ఈ – కేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రేషన్ కార్డులో ఎంతమంది ఉంటారో వారంతా రేషన్ దుకాణానికి వెళ్లి అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

రెండు నెలలుగా రేషన్ షాపుల్లో డీలర్లు ఈ-కేవైసీ ని సేకరిస్తున్నారు. అందుకోసం ఆధార్ ధ్రువీకరణతో పాటు వేలిముద్రలు, కంటిపాప గుర్తింపును తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ శనివారం నాటికి 70 శాతం పూర్తి అయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా 87.81% నమోదు తో మొదటి స్థానంలో ఉంది. అతి తక్కువగా వనపర్తి జిల్లాలో 54.17% పూర్తయింది. రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ఐరీస్ , ఈపోస్ మిషన్లు జియో ట్యాగింగ్ విధానాలను అందుబాటులోకి తెచ్చి కొంతవరకు అడ్డుకట్ట వేయగలిగింది. అయితే సరుకులు తీసుకునేందుకు కార్డుదారుల్లో ఏ ఒక్కరు వేలిముద్ర వేసిన సరిపోయేది. దీంతో చనిపోయిన వారి పేరిట సైతం సరుకులు తీసుకుంటున్నారు. అంతేకాకుండా కొందరు అర్హత లేని వారు కూడా కార్డులు పొంది నెల నెలా రేషన్ తీసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే సరుకుల పంపిణీ లో పూర్తి పారదర్శకత కోసం రేషన్ కార్డులకు ఈ-కేవైసీ చేస్తున్నారు. దీంతో అర్హత కలిగిన వారే రేషన్ కార్డును పొందుతారు. కాబట్టి తెలంగాణ ప్రజలు జనవరి 31 లోపు రేషన్ కార్డులకు ఈ-కేవైసీ చేయించుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ సూచించింది. గతంలో రేషన్ సరుకులు తీసుకునేందుకు లబ్ధిదారుల్లో ఏ ఒక్కరు వేలిముద్ర వేసిన సరిపోయేది. దీంతో చనిపోయిన వారి పేరిట కూడా కొందరు సరుకులు తీసుకుంటున్నారు. అర్హత లేని వారు కూడా కార్డులు పొంది ప్రతి నెలా రేషన్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సరుకుల పంపిణీలో లోపాలను సవరిస్తూ రేషన్ కార్డులకు ఈ-కేవైసీ చేస్తున్నారు. ప్రతి ఒక్క రేషన్ కార్డు కి ఈ-కేవైసీ తప్పనిసరి అని తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సూచించింది.

Advertisement
WhatsApp Group Join Now

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది