KCR : కేసీఆర్ రూట్ లో ట్రంప్..!
ప్రధానాంశాలు:
KCR : కేసీఆర్ రూట్ లో ట్రంప్..!
KCR : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘కేసీఆర్ కిట్’ పథకం మాతృశిశు సంక్షేమానికి మార్గదర్శకంగా నిలిచింది. 2017లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, గర్భిణీ స్త్రీలకు మరియు నవజాత శిశువులకు అవసరమైన సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆడబిడ్డకు రూ.13,000, మగబిడ్డకు రూ.12,000ను మూడు దశల్లో అందిస్తూ, తల్లులకు ప్రోత్సాహం కలిగించడమే కాకుండా శిశు మరణాల రేటు తగ్గించేందుకు దోహదపడింది.

KCR : కేసీఆర్ రూట్ లో ట్రంప్..!
ఇప్పుడు అదే మార్గంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఓ వినూత్న పథకాన్ని ప్రతిపాదిస్తున్నారు. “ట్రంప్ అకౌంట్” పేరిట రిపబ్లికన్ పార్టీ హౌస్‌లో ప్రవేశపెట్టిన ఈ పథకం ప్రకారం.. 2025 నుండి 2029 మధ్య కాలంలో అమెరికాలో జన్మించే ప్రతి శిశువు అకౌంట్ లో $1000 (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.8,600) జమ చేస్తారు. అదేవిధంగా వారి తల్లిదండ్రులు ప్రతి ఏడాది $5000 వరకు జమ చేయవచ్చు. తల్లిదండ్రులకు ఆ స్థోమత లేకపోతే ప్రభుత్వం చొరవ తీసుకుని డిపాజిట్ చేస్తుంది.
ఈ ట్రంప్ అకౌంట్‌లో జమ చేసిన నిధులను కేవలం విద్య, హౌసింగ్, వ్యాపారం వంటి అవసరాలకు మాత్రమే వినియోగించవచ్చని నిబంధనలు విధించారు. ఇది ఒక దీర్ఘకాలిక పెట్టుబడి పథకం అనే అభిప్రాయం అక్కడి ఆర్థిక నిపుణులది. గతంలో “మాగా అకౌంట్”గా ఉన్న ఈ పథకానికి ఇప్పుడు “ట్రంప్ అకౌంట్”గా పేరుమార్చి, విధానాల్లో మార్పులు చేశారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ పథకాన్ని భారత్‌లోని కేసీఆర్ కిట్‌కు సరిపోల్చుతూ వ్యాఖ్యానించడం విశేషం.