YS Sharmila : షర్మిల చరిత్రాత్మక సవాల్ విసిరింది.. స్వీకరించే దమ్ము ఎవరికైనా ఉందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Sharmila : షర్మిల చరిత్రాత్మక సవాల్ విసిరింది.. స్వీకరించే దమ్ము ఎవరికైనా ఉందా?

YS Sharmila : వైఎస్ షర్మిల.. ఈ పేరు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మార్మోగిపోతోంది. దానికి కారణం.. వైఎస్ షర్మిల పెట్టిన పార్టీ. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో దూకుడు మీదున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని వైఎస్ షర్మిల రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తా అని మాటిచ్చారు. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తున్నారు వైఎస్ షర్మిల.అయితే.. వైఎస్ షర్మిల తన పార్టీలో త్వరలోనే కాంగ్రెస్ లో కలుపుతారంటూ వార్తలు వచ్చాయి. కానీ.. అవన్నీ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :10 July 2023,12:00 pm

YS Sharmila : వైఎస్ షర్మిల.. ఈ పేరు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మార్మోగిపోతోంది. దానికి కారణం.. వైఎస్ షర్మిల పెట్టిన పార్టీ. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో దూకుడు మీదున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని వైఎస్ షర్మిల రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తా అని మాటిచ్చారు. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తున్నారు వైఎస్ షర్మిల.అయితే.. వైఎస్ షర్మిల తన పార్టీలో త్వరలోనే కాంగ్రెస్ లో కలుపుతారంటూ వార్తలు వచ్చాయి. కానీ.. అవన్నీ ఉత్తవే అని తేలిపోయింది. తాను తెలంగాణ ప్రజల కోసమే పార్టీ పెట్టానని.. ఆ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే పార్టీలో విలీనం చేసే అవకాశం లేదని తెలిపారు. అయితే..

తాజాగా ఆమె ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పాలేరులో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పక్కాగా పోటీ చేస్తా అని ఆమె స్పష్టం చేశారు.వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి తాను పోటీ చేస్తా అని వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు. ఇదే పాలేరు మట్టి సాక్షిగా పాలేరు ప్రజలకు వైఎస్సార్ సంక్షేమ పాలన అందిస్తానని మాటిచ్చాను. రైతులకు అండగా నిలబతా అని, ఇల్లు లేని వాళ్లకు ఇల్లు కట్టిస్తా అని, పేద బిడ్డల కు ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి రాజశేఖర్ రెడ్డి అందించిన సంక్షేమ పాలన తీసుకొస్తా అని షర్మిల మాటిచ్చారు.

ys sharmila open challenge on paleru constituency

ys sharmila open challenge on paleru constituency

YS Sharmila : పాలేరు నుంచి పోటీ చేస్తా.. అసెంబ్లీలో అడుగు పెడతా

అందుకే పాలేరు నుంచే పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెడుతా అని సవాల్ విసిరారు. అయితే.. తనను పాలేరులో ఓడించేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని.. తనను దమ్ముంటే ఓడించాలని ఆమె సవాల్ చేశారు. మళ్లీ చెబుతున్నా.. నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. మీ బిడ్డగా మీకు నమ్మకంగా సేవ చేస్తా. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. కొన్ని రోజుల్లోనే ఆ పాదయాత్రను పాలేరులో ప్రారంభించి.. మొత్తం 4000 కిలోమీటర్లు పూర్తి చేసి పాలేరులో ముగిస్తా.. అని షర్మిల ప్రకటించారు.

Tags :

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది