Discount Phones : ఆ ఫోన్ మీద ఏకంగా రూ.10వేల డిస్కౌంట్.. ఇంతకీ ఏం ఫోన్ అంటే?
Discount Phones : మొబైల్ మార్కెట్లో భయంకరమైన పోటీ నెలకొంది. ఎన్నో కంపెనీలు అదిరిపోయే ఫీచర్లతో పాటు భారీ డిస్కౌంట్లను అందిస్తు్న్నాయి. మరీ ముఖ్యంగా భారతదేశంలో మొబైల్ వినియోగదారుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దాంతో మొబైల్ కంపెనీలు తమ సేల్స్ ను పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తు్న్నాయి. అయితే తాజాగా చైనా కంపెనీ షియోమీ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ షియోమీ.. తన ఉత్పత్తి అయిన షియోమీ 12ప్రో ధరపై ఏకంగా రూ.10వేల వరకు డిస్కౌంట్ ప్రకటించింది.
దీంతో ఇప్పుడు షియోమీ ప్రకటించిన ఈ ఆఫర్ గురించి అందరూ మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. అమెజాన్ వోచర్లు మరియు ఐసిఐసిఐ కార్డ్ తో దాదాపు రూ.10వేల వరకు డిస్కౌంట్ ను అందుకోవడానికి అవకాశం ఉంది. అమెజాన్ వోచర్ మీద రూ.4000 వరకు డిస్కౌంట్ రానుండగా.. ఐసిఐసిఐ కార్డ్ వాడటం ద్వారా అదనంగా మరో రూ.6000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇలా మొత్తంగా రూ.10,000 డిస్కౌంట్ షియోమీ 12ప్రోపై అందుతోంది. 8GB/256GB వేరియంట్ షియోమీ 12 ప్రో ధర మామూలుగా అయితే రూ.62,999 ఉండగా..
Phone Discount : అమెజాన్ వోచర్ మీద..
తాజాగా డిస్కౌంట్ తో అది రూ.52,999కే లభిస్తోంది. అలాగే 12GB/256GB వేరియంట్ ధర మామూలుగా రూ.66,999 ఉండగా.. రూ.56,999గా వస్తోంది. షియోమీ 12ప్రో… 6.73 ఇంచుల 2K AMOLED డిస్ ప్లే, 120Hz రీ ఫ్రెష్ రేట్ తో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 8జెన్ 1 చిప్ సెట్ సపోర్ట్ తో, 4600mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జ్ సదుపాయంతో షియోమీ 12 ప్రో వస్తోంది. ఈ ఫోన్ తో యూజర్లు 50W వైర్ లెస్ సెకండ్ ఛార్జ్, 10W రివర్స్ వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా పొందుతారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 OSతో నడుస్తుంది.