Sharmila : వైఎస్ షర్మిలకు అక్కడ భారీ షాక్..!
Sharmila : వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలకు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణలో మళ్లీ రాజన్న రాజ్యం తీసుకొస్తామని పదేపదే చెబుతున్న ఆమె కల నెరవేరేలా కనిపించడం లేదు. అందుకు బెస్ట్ ఉదాహరణ తాజాగా జరిగిన పరిణామమే. నిరుద్యోగులు, స్వతంత్రులతో హుజురాబాద్‌లో భారీగా నామినేషన్లు దాఖలు చేయించి టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎంతో చూపించాలనుకున్న ఆమె ప్రయత్నం ఆదిలోనే బెడిసికొట్టింది. కనీసం 200 మంది నిరుద్యోగులను ఎన్నికల బరిలో నిలపాలని భావించిన ఆమెకు నిరుద్యోగులే షాక్ ఇచ్చారు. ఇప్పటివరకు ఆ పార్టీ తరఫున ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నిరుద్యోగుల కోసం ఫైట్ చేస్తున్న షర్మిలను వారే పట్టించుకోవడం లేదని ఈ ఘటనతో స్పష్టమైంది. దీంతో రానున్న రోజుల్లో షర్మిల పార్టీ తెలంగాణలో నెట్టుకు రావడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Sharmila : షర్మిలను నమ్మని నిరుద్యోగులు..
ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకున్న వారికి న్యాయం చేసేందుకు, ఇకమీదట ఎవరూ సూసైడ్ చేసుకోవద్దని నిరుద్యోగుల్లో భరోసా కల్పించేందుకు ఆమె ప్రతీ మంగళవారం నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. హుజురాబాద్ ఘటనతో నిరుద్యోగులు వైఎస్ షర్మిలను నమ్మడం లేదని స్పష్టమైంది. టీఆర్ఎస్‌ను ఓడించేందుకు ఉపఎన్నిక బరిలో నిలిచే యువకులకు, స్వతంత్రులకు తమ పార్టీ మద్దతు ఉంటుందని, వారికి సాయం చేసేందుకు కో ఆర్టినేటర్‌ను కూడా నియమించింది. అయినా, నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆమెకు నిరాశే ఎదురైంది.
Sharmila : ఒక్కరంటే ఒక్కరు కూడా..
ఉపఎన్నిక కోసం నామినేషన్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. వైఎస్సార్‌టీపీ పార్టీ తరఫున గానీ, దానికి మద్దతిస్తున్న అభ్యర్థి ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడం షర్మిల పార్టీకి మైనస్‌గానే చెప్పుకోవాలి. ఆ పార్టీ నిరుద్యోగుల తరఫున ఫైట్ చేస్తున్నా నిరుద్యోగులు ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ పార్టీని నమ్మకం పోవడం గమనార్హం. దీంతో వైఎస్సార్‌టీపీ నేతల రాజకీయ జీవితం కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలాఉంటే, హుజురాబాద్‌ల్లో తమను నామినేషన్లు దాఖలు చేయకుండా అధికారులు, పోలీసు యంత్రాంగం అడ్డుకున్నదని నిరుద్యోగులు చెబుతున్నారు.
ముఖ్యంగా హుజురాబాద్‌లో పోటీ చేయాలనుకునే వారు స్థానికులు కాకపోతే ఆర్డీవో వద్ద డిక్లరేషన్ ధృవప్రతం తీసుకోవాలి. దీంతో ఆదిలోనే షర్మిల పార్టీకి అధికారులు చెక్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని సైతం ఆ పార్టీ లీడర్లు, నిరుద్యోగులు ఉటంకిస్తున్నారు. చాలా మంది నిరుద్యోగల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ముందుకు వచ్చినా రూల్స్‌ను సాకుగా చూపి అభ్యంతరం తెలపడంతో అభ్యర్థులు వెనుదిరిగినట్టు వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఏదేమైనా హుజురాబాద్ బై పోల్‌లో సత్తా చాటుతుందనుకున్న వైఎస్సార్‌టీపీ ఆరంభంలోనే చతికిల పడిందని పొలిటికల్ వర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.