Bigg Boss 6 Telugu : గీతూ ఉచ్చులో ఇరుక్కున్న రేవంత్.. ఫైమా నీపై పడుకున్నందుకు ఫీల్ అవ్వకంటూ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss 6 Telugu : గీతూ ఉచ్చులో ఇరుక్కున్న రేవంత్.. ఫైమా నీపై పడుకున్నందుకు ఫీల్ అవ్వకంటూ..?

 Authored By mallesh | The Telugu News | Updated on :11 October 2022,12:30 pm

Bigg Boss 6 Telugu : బిగ్‌బాస్ సీజన్-6 షోపై ఆడియెన్స్ ఆసక్తి సన్నగిల్లినట్టు తెలుస్తోంది. గతంతో పోలిస్తే ఈసారి ప్రేక్షకులు బిగ్ బాస్ ఎపిసోడ్స్ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదంట.. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈషోలో తెలిసిన మొహాలు పెద్దగా లేకపోవడం మైనస్ అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం యూట్యూబర్స్, సోషల్ మీడియా సెలబ్రిటీలను ఎక్కువగా తీసుకొస్తే ఏం లాభం.. అందులోనూ అమ్మాయిలను ఎక్కువగా తీసుకురావడం వలన ఏం వస్తుందని విమర్శించేవారు లేకపోలేదు. బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్లు పెద్దగా యాక్టివ్‌గా లేరని, నిద్రమొహాలు వేసుకుని గేమ్ ఆడుతున్నారని కామెంట్స్ వస్తున్నాయి.

కొందరు కావాలనే తోటి కంటెస్టెంట్లతో గొడవలు పెట్టుకుని హైలెట్ అవ్వాలని చూస్తుండగా.. మరికొందరు గేమ్ ఆడేందుకు సిన్సియర్‌గా ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ సీజన్‌లో గలాట గీతూ, సింగర్ రేవంత్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరిలో గీతూ కంటే రేవంత్‌కు కాస్త ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గీతూ ఒక యూట్యూబర్. మొన్నటివరకు ఈమె ఎవరో కూడా ఎవరికి తెలీదు. హౌస్‌లోకి వచ్చాకే ఈమె పలానా అని కొందరు గుర్తుపడుతున్నారు. గీతూ చూసేందుకు అలా కనిపిస్తున్నా పెద్ద రౌడీ.. వదురుబోతు అని, చిటికిమాటికి మాటలు జారుతుంటుందని..గొడవకు దిగుతుందని ఆమె బ్యాడ్ నేమ్ ఉంది. దీని నుంచి బయట పడేందుకు తాజాగా సింగర్ రేవంత్ మైండ్‌సెట్ మార్చేందుకు గీతూ మైండ్ గేమ్ ప్రారంభించిందని టాక్.

Bigg Boss 6 Telugu Revant is stuck in Geethu trap

Bigg Boss 6 Telugu Revant is stuck in Geethu trap

Bigg Boss 6 Telugu : గీతూ మైండ్ గేమ్.. రేవంత్ కామ్

రీసెంట్‌గా 33వ ఎపిసోడ్‌లో తన బుగ్గపై ఎందుకు ముద్దు పెట్టావ్ అంటూ మొదలెట్టిన గీతూ.. రేవంత్ పై ప్రశ్నల వర్షం కురిపించింది. నాకు ముద్దు పెట్టావ్. నాకు పెద్దగా ఏమి అనిపించలేదు. నేను తప్పుగా తీసుకోను. కానీ నువ్వు ఫైమా మీద పడుకున్నావ్ కదా.. తను ఏమైనా అనుకున్నదేమో అడిగావా? అందరూ నాలాగా లైట్ తీసుకోరు కదా. ఎందుకైనా మంచిది కనుక్కో.ఎదుటి వారికి ఇష్టం లేకుండా వారి దగ్గర లీనియన్స్ తీసుకోకు అంటూ మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది గీతూ.. ఈ విషయం తెలియక రేవంత్ ఆ మాయలో పడి ఫైమా దగ్గర క్లారిటీ తీసుకున్నాడు. ఎపిసోడ్‌లో రేవంత్ చేసింది హైలెట్ కాకపోయినా గీతూ అడుగడం వలన హైలెట్ అయ్యిందని తెలుస్తోంది.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది