jobs in BSF : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. బీఎస్ఎఫ్‌లో భారీగా ఉద్యోగావకాశాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

jobs in BSF : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. బీఎస్ఎఫ్‌లో భారీగా ఉద్యోగావకాశాలు..!

 Authored By mallesh | The Telugu News | Updated on :30 January 2022,10:00 pm

jobs in BSF : నిరుద్యోగులకు కేంద్రం హోంమంత్రిత్వశాఖ శుభవార్త ప్రకటించింది. సరిహద్దు భద్రతా దళం BSFలో భారీగా నియామకాలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఏకంగా 2,788 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. చదువుకుని ఖాళీగా ఉన్న నిరుద్యోగులు, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

jobs in BSF : రిక్రూట్‌మెంట్ విధానం, అర్హతలు

good news for the unemployed huge job opportunities in bsf

good news for the unemployed huge job opportunities in bsf

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో చేరి దేశానికి సేవ చేయాలనుకునే వారికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిజంగానే శుభవార్త చెప్పిందనుకోవచ్చు. బీఎస్‌ఎఫ్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేసింది. బీఎస్‌ఎఫ్‌లోని వివిధ విభాగాల్లో మొత్తం 2,788 ఉద్యోగ ఖాళీల సంఖ్య ఉండగా, దరఖాస్తుకు 2022 ఫిబ్రవరి 28ని చివరి తేదీగా ప్రకటించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ ప్రక్రియను ప్రారంభించవచ్చును.

విద్యార్హత విషయానికొస్తే పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో రెండేళ్లు డిప్లామా పూర్తి చేసి ఉండాలి. ఫిజికల్ టెస్టుల విషయానికొస్తే పురుషులు ఎత్తు 167.5 సెంమీ, స్త్రీలు-157 సెం.మీ.. ఛాతీ పురుషులకు మాత్రమే 78-83సెం.మీ ఉండాలి. షెడ్యూల్ కులాలు /తెగలు/గిరిజనుల విషయానికొస్తే ఎత్తు పురుషులకు -162.5, స్త్రీలు 157 సెం.మీ. ఛాతీ పురుషులకు మాత్రమే 76-81 ఉండాలి. కొండ ప్రాంతాల అభ్యర్థులు పురుషులకు ఎత్తు 165 సెంమీ మరియు స్ట్రీలకు 150 సెంమీ ఉండాలి. వయో పరిమితి 18 నుంచి 23 ఏళ్ల మధ్యలో ఉండాలి. వేతనం కూడా భారీగానే ఉంటుంది. కానీ దానికి సంబంధించిన వివరాలు పొందుపరచలేదు.

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది