Marchery Room : షాకింగ్ ఘటన.. చనిపోయాడానుకుని మార్చురిలో పెడితే వ్యక్తి లేచొచ్చాడు.. ఎక్కడంటే?
Marchery Room : జనరల్‌గా చనిపోయిన వ్యక్తులను మార్చురీ ఫ్రీజర్ బాక్సులో పెడుతుంటారు. అది సహజమే. వ్యక్తి చనిపోయాడని డాక్టర్స్ నిర్ధారించిన తర్వాత వైద్యులు మార్చురి ఫ్రీజర్ బాక్సులో పెడతారు. అలా ఓ వ్యక్తి చనిపోయాడని నిర్ధారణ అయిన తర్వాత మార్చురీలో పెట్టాక వ్యక్తి లేచి వస్తే ఎలా ఉంటుంది ఊహించుకోండి.. షాకింగ్‌గా ఉంటుంది కదా.. అటువంటి ఘటన జరగడం అసాధ్యం అనుకుంటారు. కానీ, అటువంటి ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మోర్దాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఈ ఘటన వెలుగు చూసింది.స్థానికంగా ఎలక్ట్రీషియన్ పని చేసే శ్రీకేశ్ కుమార్.. బైక్ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డాడు.
దాంతో స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ట్రీట్‌మెంట్ అనంతరం సదరు వ్యక్తి పరిస్థితి విషమించి చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు. దాంతో అధికారులు పేషెంట్ చనిపోయాడునుకుని మార్చురీ ఫ్రీజర్ బాక్స్‌లో పెట్టేశారు. అలా బతికుండగానే సదరు వ్యక్తిని ఆస్పత్రిలోని మార్చురీలో పెట్టేశారు. బతికున్న సదరు వ్యక్తి ఏడు గంటల పాటు మార్చురీలోనే ఉన్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి బతికున్నాడనే విషయం ఎలా వెలుగులోకి వచ్చిందంటే..

Marchery Room different incident in that hospital
Marchery Room : పంచనామాకు సిద్ధమైన అధికారులు.. అంతలోనే అనుకోని పరిణామం..
సదరు పేషెంట్ చనిపోయాడని భావించిన ఆస్పత్రి అధికారు పంచనామా చేసేందుకుగాను కుటుంబ సభ్యుల సిగ్నేచర్ తీసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే సదరు పేషెంట్‌ను చూడాలని ఆయన కుటుంబ సభ్యులుకోరారు. దాంతో ఆస్పత్రి వారు శవంగా భావించిన శ్రీకేశ్ కుమార్‌ను మార్చురీలో చూపించారు. ఆ బాడీని చూసి సదరు పేషెంట్ మరదలు మధుబాలా తన బావ బతికే ఉన్నాడని అంది. అతను చనిపోలేదని డాక్టర్స్‌ను అలర్ట్ చేసింది. అతను చనిపోలేదని, వ్యక్తిలో కదలికలున్నాయని పేర్కొంది.
అంతే వైద్యులు అప్రమత్తమై ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేశారు. అలా చనిపోయాడనుకున్న వ్యక్తి లేచొచ్చినంత పని అయింది. అయితే, వైద్యులు హార్ట్ బీట్ చెక్ చేసిన తర్వాతనే సదరు పేషెంట్ మరణించాడని ధ్రువీకరించారని, అలా వ్యక్తి చనిపోయినట్లు కన్ఫర్మ్ చేశాకే..మార్చురీకి తరలించినట్లు మోర్దాబాద్ ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శివసింగ్ తెలిపారు. అలా హార్ట్ బీట్ లేని వ్యక్తి ప్రాణాలతో బయటపడటం అరుదని చెప్పారు. అయితే, వైద్యుల నిర్లక్ష్యంపై తాము కేసు పెడతామని సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు అంటున్నారు.