Palathalikalu : మన అమ్మమ్మల స్టైల్ లో పాలతాలికలు చేశారంటే.. నోరూరించుకుంటూ తింటారు
Palathalikalu : తీపి వంటకాలను ఇష్టపడని వారు ఉండరు. మన ఇళ్లల్లో ప్రతిరోజు తీపి వంటకాలు ఉండకపోయినా పండగలు సీజన్లో మాత్రం గ్యారెంటీగా స్వీట్స్ చేసుకొని తింటాం. కొద్ది రోజుల్లోనే దసరా పండుగ రాబోతుంది. ఈ పండగకి కనుక పాలతాలికలు చేస్తే ఇంటిల్లిపాదీ నోరూరించుకుంటూ తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. పాలతాలికలను ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.కావలసిన పదార్థాలు: 1) బెల్లం 2) సగ్గుబియ్యం 3) పాలు 4) బియ్యం పిండి 5) నెయ్యి 6) యాలకులు 7) బాదం 8) జీడిపప్పు 9) కిస్ మిస్ లు 10) వాటర్
తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో ఒకటిన్నర గ్లాసు తురిమిన బెల్లం వేసుకోవాలి. తర్వాత అర గ్లాస్ నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. తర్వాత మంటను మీడియం లో ఉంచి రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు కొంచెం జిగురు జిగురుగా ఉంటే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నె పెట్టుకుని ఒక స్పూన్ నీళ్లు పోసి మూడు గ్లాసుల పాలు, ఒకటిన్నర గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చేవరకు కాగనిచ్చి మధ్య మధ్యలో కలుపుతూ తర్వాత ముప్పావు గ్లాసు పాలు పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల ఒక గంట పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలో ముప్పావు కప్పు బియ్యప్పిండి తీసుకుని ఇందులో కరిగించి పెట్టుకున్న బెల్లం గరిటెడు పోసుకోవాలి. అలాగే పక్కకు తీసి పెట్టుకున్న వేడివేడి పాలని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఈలోపు సగ్గుబియ్యం ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలికలు చేసుకోవాలి. ఉడికించుకున్న పాలలో కొద్దిగా నెయ్యి, చేసి పెట్టుకున్న తాలికలు వేసి లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. చివర్లో యాలకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివర్లో బెల్లం నీళ్లను వడకట్టుకోని పోసుకుని బాగా కలపాలి. తర్వాత మరొక గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి బాదం, జీడిపప్పు, యాలకులు వేయించుకొని ఈ పాలతాలికలో వేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ పాలతాలికలు రెడీ.