వీడియో : గంగవ్వతో కలిసి మూతి తిప్పిన వింక్ బ్యూటీ
తెలుగు ప్రేక్షకులకు ఈమద్య కాలంలో గంగవ్వ చాలా దగ్గర అయ్యింది. బిగ్ బాస్ కు ముందే గంగవ్వ యూట్యూబ్ వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. దాంతో ఆమెకు మంచి అవకాశాలు అయితే వచ్చాయి. సినిమాలతో పాటు బుల్లి తెరపై కనిపించే అవకాశాలు దక్కించుకుంది. బిగ్ బాస్ తర్వాత సినిమాల ప్రమోషన్ లో గంగవ్వ కీలకంగా కనిపిస్తూ ఉంది. ప్రతి సినిమా విడుదల సమయంలో ఆమె ఆ సినిమాకు సంబంధించిన వారితో ఇంటర్వ్యూ చేయడం లేదంటే మరేదైనా ఫన్నీ వీడియో చేయడం జరుగుతుంది. ఇటీవలే నాగార్జునతో కలిసి వైల్డ్ డాగ్ ప్రమోషన్ వీడియో చేసింది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న 11త్ అవర్ వెబ్ సిరీస్ కోసం తమన్నాను ఇంటర్వ్యూ చేసింది. తాజాగా ఇష్క్ సినిమా ప్రమోషన్ కోసం వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ తో కలిసి సందడి చేసింది.
priya prakash varrier : గంగవ్వ కు మూతి తిప్పడం నేర్పించింది ప్రియా ప్రకాష్ వారియర్
ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియా సెన్షేషన్ అనే విషయం అందరికి తెల్సిందే. కన్ను కొట్టి ముద్దు గన్ను పేల్చి ఎంతటి సంచలనం సృష్టించో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ప్రియా ప్రకాష్ వారియర్ ను కలిసి గంగవ్వ కొత్తగా ఆమెకు మూతి తిప్పడం నేర్పించింది. కన్ను గీటి సంచలనం సృష్టించిన ప్రియా ప్రకాష్ వారియర్ మూతి తిప్పే వీడియోతో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఇష్క్ సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో సందడి చేస్తోంది. వరుసగా ప్రముఖ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలతో పాటు ముద్దుగుమ్మ గంగవ్వతో కూడా చిట్ చాట్ చేసింది.

priya prakash varrier and gangavva funny video
మలయాళి ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా ఇప్పటి వరకు కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకోలేదు. ఒరు ఆదార్ లవ్ తో పరిచయం అయిన ఈమె తెలుగులో ఇప్పటికే చెక్ సినిమాలో కూడా నటించింది. ఆ సినిమా నిరాశ పర్చింది. దాంతో మళ్లీ ఇంద్ర సినిమాలో బుడ్డోడిగా కనిపించిన తేజ సజ్జ తో కలిసి ఇష్క్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో వీరిద్దరి రొమాన్స్ ఆకట్టుకుంటుందని ట్రైలర్ మరియు టీజర్ లను చూస్తే అనిపిస్తుంది. ప్రమోషన్ కోసం ఇద్దరు కూడా తెగ సందడి చేస్తున్నారు. మరి ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ లో ఎంత వరకు నెట్టుకు వస్తుందో చూడాలి.
#Gangavva to #PriyaPvarrier: Kannu kottinantha Veasy kadu Muthi Thippudu #ISHQ Not a love story! Releasing on April 23rd!! #ISHQFromApril23rd@tejasajja123 #SSRaju #RBChoudary #NVPrasad #ParasJain @haashtagmedia pic.twitter.com/PzTFroAAfH
— BARaju (@baraju_SuperHit) April 17, 2021