Sudigali Sudheer : నా కొడుకును మోసం చేసింది.. రష్మీ చేసిన పనికి కుమిలిపోతున్న సుడీగాలి సుధీర్..!
Sudigali Sudheer : జబర్దస్ యాంకర్ కమ్ యాక్టర్ రష్మీ గౌతమ్ సుడీగాలి సుధీర్ మధ్యలో ఎలాంటి రిలేషన్ ఉందో తెలుసుకోవాలని చాలామంది ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లిచేసుకుంటారని అప్పట్లో జోరుగా వార్తలొచ్చాయి. అంతేకాకుండా వీరిద్దరూ రియాలిటీ, ఈవెంట్స్‌లో చాలా సార్లు ప్రపోజ్ చేసుకున్నారు. ఓ ఫెస్టివల్ స్కిట్‌లో అయితే ఏకంగా మ్యారేజ్ చేసుకున్నారు. వీరు నిజంగానే మ్యారేజ్ చేసుకున్నారా? అని జోరుగా వార్తలొచ్చాయి. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే అది ఫెస్టివల్ స్కిట్ అని తెలియడంతో అంతా షాకయ్యారు. కొందరైతే తిట్టుకున్నారు అని కూడా టాక్..
సుడీగాలి సుధీర్ చాలా కష్టపడి ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి పొజిషన్‌లో ఉన్నాడు. తను ఈ స్థాయికి ఎలా వచ్చాడో వారి కుటుంబసభ్యులు సుధీర్ తండ్రి ఓసారి షోకు వచ్చి చెప్పడంతో అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మేజిషియన్ నుంచి జబర్దస్ట్ కమెడియన్‌గా ఆ తర్వాత సినిమా యాక్టర్‌గా అంచెలంచెలుగా ఎదిగాడు. తన మీద తాను జోకులు వేసుకుని స్కిట్ పేలేలా చేయడం సుధీర్ మ్యానరిజం అని కూడా చెప్పుకోవచ్చు. స్కిట్ చేస్తున్న టైంలో రష్మీ దగ్గరకు వెళ్లి పంచులు వేస్తుంటాడు. కొంచెం గ్యాప్ దొరికితే చాలు వీరిద్దరి మధ్యలో బ్యాక్ గ్రాండ్ మ్యూజి్క్ వేసి వీరు లవర్స్ అని త్వరలోనే పెళ్లి అన్నట్టు తెగ కలరింగ్ ఇస్తుంటారు ప్రోగ్రాం డైరెక్టర్స్..
Sudigali Sudheer : నా కొడుకునే మోసం చేసిందన్న సుధీర్ తల్లి
అయితే, తాజాగా వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ షిప్ గురించి ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మీ కుండబద్దలు గొట్టింది. తమ మధ్య ఎటువంటి లవ్ లేదని, తామిద్ధరి మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని రష్మీ క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా లాక్ డౌన్ టైంలో ఓ జాబర్‌ను రష్మీ మ్యారేజ్ చేసుకుందని సోషల్ మీడియా వేదికగా జోరుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. తన కొడుకును ప్రేమించి మోసం చేసిందని సుధీర్ తల్లి రష్మీ మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. కాగా, దీనిపై సుధీర్, రష్మీ అధికారికంగా స్పందించాల్సి ఉంది. అప్పుడే ఈ వార్తలపై క్లారిటీ రానుంది.