Teacher Bathing : ఆన్‌లైన్ క్లాసెస్ చెప్తూ స్నానం చేసిన టీచర్.. దర్యాప్తునకు కమిటీ..
Teacher Bathing : కొవిడ్ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా పని పరిస్థితుల్లో గణనీయమైన మార్పులొచ్చాయి. ఇకపోతే పిల్లలు అయితే ఇళ్లకే పరిమితమైపోయారు. ఈ క్రమంలోనే వారి అకడమిక్ ఇయర్ లాస్ కాకుండా ఉండేందుకుగాను విద్యాసంస్థల యాజమాన్యాలు ఆన్ లైన్ క్లాసెస్ షురూ చేశాయి. దాంతో టీచర్లు విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసెస్ చెప్తున్నారు. కాగా, అలా క్లాసెస్ చెప్తున్న క్రమంలో అనుకోకుండా ఓ ఘటన జరిగింది. అదేంటంటే..
Teacher Bathing : లైవ్ వీడియో కెమెరా స్విచ్ ఆన్..
దక్షిణ కొరియాకు చెందిన ఓ టీచర్ ప్రతీ రోజు మాదిరిగానే విద్యార్థులకు ఆన్ లైన్‌లో లెస్సన్స్ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలోనే తాను లైవ్ వీడియో ఆపేశానని అనుకున్నాడు. అలా లైవ్ వీడియో ఆపేశానని భావించిన టీచర్.. వాయిస్ ద్వారా పాఠాలు చెప్తూనే బాత్ రూంలోకి వెళ్లాడు. అలా బాత్ రూంకి వెళ్లి స్నానం చేస్తూనే పాఠాలు చెప్తున్నాడు. అయితే, అనుకోకుండా వీడియో కెమెరా ఆన్ అయింది. ఆ విషయం గమనించకుండా సదరు టీచర్ తాను ఓ వైపు లెస్సన్స్ బోధిస్తూ మరో వైపు స్నానం చేస్తున్నానని అనుకున్నాడు. కానీ, టీచర్ బాత్ రూంలో స్నానం చేయడం ఆన్ లైన్‌లో లైవ్ వీడియో కెమెరా ద్వారా విద్యార్థలకు కనబడుతోంది. కాగా, ఈ విషయమై విద్యార్థులు టీచర్‌కు సూచించలేకపోయారు. అయితే, తాము లైవ్‌లో చూడకూడదని చూసేశామని విద్యార్థులు అంటున్నారు.
దక్షిణ కొరియాలోని హాన్యాంగ్ యూనివర్సిటీలో ఈ ఘటన జరిగింది. కాగా, ఈ విషయమై టీచర్‌ను వివరణ కోరగా తాను ప్రతీ రోజు మాదిరిగా కెమెరా స్విచ్ ఆఫ్ చేశాననుకున్నానని, కానీ, అనుకోకుండా కెమెరా ఆన్ అయిందని, అలా జరుగుతుందని తాను అనుకోలేదని పేర్కొన్నాడు. తాను ఇది వరకు ఇలా చాలాసార్లు లెస్సన్స్ చెప్తూనే స్నానం చేశానని, కానీ, ఈ సారి ఇలా జరిగిపోయిందని చెప్పాడు. ఈ విషయం పట్ల తాను విద్యార్థులకు క్షమాపణ చెప్తున్నానని అన్నాడు. కాగా, స్టూడెంట్స్ కూడా ఈ విషయమై స్పందించారు. తమకు ప్రతీ రోజు వాటర్ సౌండ్ వినబడేదని, కానీ, ఈ సారి లైవ్ వైటర్‌తో స్నానం చేస్తున్న వీడియో కనబడిందని తెలిపారు.ఈ విషయమై యూనివర్సిటీ వారు దర్యాప్తునకు కమిటీని ఆదేశించారు. కమిటీ ఇచ్చే రిపోర్టును బట్టి టీచర్‌పై చర్యలు ఉంటాయని యూనివర్సిటీ పేర్కొంది.