Draupadi : ఐదుగురు భర్తలతో ద్రౌపది.. ఒక భర్త నుంచి మరో భర్త వద్దకు వెళ్లేటప్పుడు కన్యగా మారేది.. ఎలాగో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Draupadi : ఐదుగురు భర్తలతో ద్రౌపది.. ఒక భర్త నుంచి మరో భర్త వద్దకు వెళ్లేటప్పుడు కన్యగా మారేది.. ఎలాగో తెలుసా?

 Authored By kranthi | The Telugu News | Updated on :26 September 2023,8:00 pm

Draupadi : తింటే గారెలే తినాలి. వింటే భారతమే వినాలి అంటారు. మహాభారతంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే చెప్పారు. అందుకే కొన్ని సందర్భాల్లో మహాభారతాన్ని ఆదర్శంగా తీసుకుంటారు. ఒక వ్యక్తికి ఏదో ఒక విషయంలో మహాభారతంలో జరిగిన విషయాలు తారసపడతాయి. ఇందులో కుళ్లు, కుతంత్రాలు, నీతి, ధర్మం ఇలా అన్నిరకాల గుణాలు కనిపిస్తాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం.. ద్రౌపది ఐదుగురు భర్తలతో కలిసి ఉండటం. ద్రౌపది ఒక భర్త నుంచి మరో భర్త దగ్గరికి వెళ్లేటప్పుడు కన్యగా మారేదట.

unknown facts about draupadi from mahabharatam

#image_title

అందుకు కారణం ఏంటంటే.. స్వయంవరంలో భాగంగా అర్జునుడు ద్రౌపదిని గెలుస్తాడు. దీంతో ఆమెను తీసుకొని ఇంటికి వెళ్తాడు. తను గెలిచిన బహుమతిని చూడాలని కుంతిని కోరుతాడు. దీంతో అర్జునుడు తీసుకొచ్చింది తన భార్య అని చూడకుండానే పరధ్యానంలో ఐదుగురిని పంచుకోవాలని చెబుతుంది. తల్లి మాటను కాదనలేక ద్రౌపది ఐదుగురిని పంచుకుంటుంది.

Draupadi : ఏ భర్త వద్దకు వెళ్లినా గొడవ లేకుండా చేసుకున్న ద్రౌపది

ద్రౌపది ఐదుగురు భర్తలను పంచుకునే క్రమంలో ఏ భర్త వద్ద గొడవ లేకుండా చూసుకుంటుంది. అంతే కాకుండా ఒక భర్త నుంచి మరో భర్త వద్దకు వెళ్లేటప్పుడు కొన్ని విషయాలు పాటించేది. ఒక నెల పాటు ఒకరి దగ్గర ఉండి, మరో నెలలో మరో భర్త వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒక భర్త వద్ద నుంచి మరో భర్త వద్దకు వెళ్లేటప్పుడు ద్రౌపది కన్యగా మారేది. అందుకు కారణం ఏంటంటే.. ద్రౌపది అందరిలాగా కడుపులో నుంచి జన్మించలేదు. యుక్త వయసులో ఉన్న కన్యగా అగ్ని నుంచి పుట్టింది. అందుకే ఆమెను యగ్నశీలి అంటారు. ఈ క్రమంలో ద్రౌపది ఒక భర్త నుంచి మరో భర్త వద్దకు వెళ్లేటప్పుడు అగ్నిలో నుంచి నడిచేది. దీంతో ఆమె కన్యగా మారేది. ఇదిలా ఉండగా ఐదుగురు అన్నదమ్ముల మధ్య ఒక నియమం ఉండేది. ద్రౌపది ఎవరి దగ్గరైనా ఉన్నప్పుడు వాళ్ల దగ్గరకి ఇంకో వ్యక్తి వెళ్లకుండా ఉండేవారు. కానీ.. ఒకసారి పశువుల కాపరి వచ్చి తన పశువులను దొంగలించారని కాపాడాలని అర్జునుడిని కోరుతాడు. దీంతో అర్జునుడు నియమం తప్పి ధర్మరాజు వద్దకు విల్లు కోసం వెళ్తాడు. ఈ సమయంలో ద్రౌపది అక్కడే ఉంటుంది. దీంతో విల్లును తీసుకొని పశువులను రక్షిస్తాడు. కానీ.. ఆ తర్వాత నియమం ప్రకారం అరణ్యవాసం చేస్తాడు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది