Draupadi : ద్రౌపతి పంచపాండవులతో కాపురం ఎలా చేసేదో తెలుసా…!
Draupadi : మహాభారతంలో ఐదుగురు పాండవులకు ద్రౌపది ఒక్కతే భార్య అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అయిదుగురు భర్తలు కలిగిన ద్రౌపతి కూడా పతివ్రతే అంటారు. అయితే ఒక భర్తను కలిగిన స్త్రీ పతివ్రత అవుతుంది కానీ ఐదుగురు భర్తలను కలిగిన ద్రౌపతి పతివ్రత ఎలా అవుతుంది అని చాలామంది వాదిస్తూ ఉంటారు. అయితే నిజానికి పతియే ప్రత్యక్ష దైవంగా భావించే ప్రతి స్త్రీని పతివ్రత అని అంటారు. అంటే భర్త తప్ప మరో పురుషుడి […]
ప్రధానాంశాలు:
Draupadi : ద్రౌపతి పంచపాండవులతో కాపురం ఎలా చేసేదో తెలుసా...!
Draupadi : మహాభారతంలో ఐదుగురు పాండవులకు ద్రౌపది ఒక్కతే భార్య అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అయిదుగురు భర్తలు కలిగిన ద్రౌపతి కూడా పతివ్రతే అంటారు. అయితే ఒక భర్తను కలిగిన స్త్రీ పతివ్రత అవుతుంది కానీ ఐదుగురు భర్తలను కలిగిన ద్రౌపతి పతివ్రత ఎలా అవుతుంది అని చాలామంది వాదిస్తూ ఉంటారు. అయితే నిజానికి పతియే ప్రత్యక్ష దైవంగా భావించే ప్రతి స్త్రీని పతివ్రత అని అంటారు. అంటే భర్త తప్ప మరో పురుషుడి స్పర్శ తెలియని స్త్రీ అని దీని అర్థం.అయితే పాండవులు ఐదుగురితో పిల్లలను కన్నా ద్రౌపతి పతివ్రత ఎలా అవుతుందనే సందేహాలు చాలామందికి ఉన్నాయి. అదే పురాణాల ప్రకారం ద్రౌపతి ఐదుగురు భర్తలతో కాపురం చేసింది కానీ ఆ సమయంలో ఆమె పాటించిన నియమాలు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. ఇక ఆ నిజాలు అన్నీ తెలిస్తే ఆమెకు చేతులెత్తి నమస్కరించకమానరు.అయితే పురాణాల ప్రకారం ఐదుగురు భర్తలతో కాపురం చేసేటప్పుడు ద్రౌపది చాలా నియమాలను పాటించిందట. ఒక భర్త దగ్గర నుండి మరొక భర్త దగ్గరికి వెళ్లేటప్పుడు ఆమె అగ్నిలోంచి నడుచుకుంటూ వెళ్లేదని పురాణాలు చెబుతున్నాయి. అయితే పునీతులను చేయడంలో అగ్నికి మించింది ఏమీ లేదు.
కాబట్టి అగ్ని లో నుండి నడిచి వెళ్లేటప్పుడు ఆమె పవిత్రత పొందేదట. అయితే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ..పాండవుల లెక్కకి ఐదుగురు అని చెబుతారు కానీ…ఇంద్రుడే ఇలా ఐదుగురి రూపంలో జన్మించాడని ఇక ఇంద్రుడి భార్య సచి దేవి ద్రౌపతి గా జన్మించిందని మరో పురాణగాథ చెబుతోంది. అంతేకాక పాండవులు మరియు ద్రౌపతి నవమాసాలు తల్లి గర్భంలో పెరిగి యోనిజులుగా జన్మించిన వారు కాదట. వీరంతా అయోనిజులు అంటే యోని ద్వారా బయటకు రాలేదు అని అర్థం.పాండురాజు భార్యలైన కుంతి మాద్రిలు ఓ మహర్షి ఇచ్చిన సంతాన మంత్ర మహిమతో పంచ పాండవులకు జన్మనిస్తారు. ఇక ఈ క్రమంలో యముడు , ఇంద్రుడు, వాయువు, అశ్విని దేవతలు వారి వడ్గనున్న ఇంద్రుని పంచప్రాణాలను పంచ పాండవులుగా అనుగ్రహించి..తిరిగి జన్మ ఎత్తేలా చేస్తారు. కావున పంచ పాండవులు ఐదుగురు కలిస్తేనే ఒక ఇంద్రుడు. ఇక ద్రౌపతి అగ్ని నుంచి పుట్టింది.అయితే ద్రౌపది శిశువుగా పుట్టలేదు ఏకంగా యుక్త వయస్సుతో ఆమె జన్మించింది. పంచల రాజు అయిన ధూపదుడికి ఆమె అగ్ని ద్వారా జన్మించింది.అందుకే ద్రౌపదిని యజ్ఞసేని అని కూడా అంటుంటారు. అంటే అగ్నిగుండం నుండి ఉద్భవించిన కారణజన్మురాలు అని అర్థం.
తర్వాత పాంచాల రాజ్యానికి ఆమె రాని కావడం వలన పాంచాలి అనే పేరు మరియు అగ్నిదేవుడు నుండి జన్మించడం వలన యజ్ఞ సేని అనే పేరు ,అదేవిధంగా ఐదుగురు భర్తలకు భార్య అవడం వలన పంచాలి అనే పేర్లు వచ్చాయి. వాస్తవానికి ద్రౌపతి పంచ పాండవులు ఐదుగురిని పెళ్లి చేసుకోలేదు. మత్స్య యంత్రాన్ని జయించిన అర్జునుడిని ద్రౌపతి వరించింది.అయితే ద్రౌపదిని తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నేను ఒక మంచి బహుమతిని తీసుకువచ్చానని తల్లి కుంతితో అర్జునుడు అంటాడు. అర్జునుడి మాట విన్న కుంతీదేవి ఐదుగురు సమానంగా పంచుకొండి నాయనా అని అంటుంది. దీని కారణంగానే పాండవులు ఐదుగురు ద్రౌపదిని పంచుకుంటారు. దీని ఫలితంగా పాంచాలిగా మారింది ద్రౌపతి. ఇక ద్రౌపతికి కలిగిన సంతానమే ఉప పాండవులు. వీరిలో ధర్మరాజుకు ద్రౌపదికి ప్రతివిందుడు , భీముడికి శ్రుతసోముడు , అర్జునుడికి శ్రుత కీర్తి , నకులుడికి షతానికుడు, సహదేవుడికి శ్రుతసేనుడు జన్మించారు.