Bharatiya Janata Party : వైఎస్ జగన్‌ను డైరెక్ట్‌గా ఢీ కొనలేక… అద్భుతమైన ప్లాన్ వేసిన బీజేపీ
Bharatiya Janata Party : ఒకనాడు రెండే సీట్లున్న బీజేపీ నేడు కేంద్రంతో పాటు పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. కాగా, రాజకీయం చేయడంలో బీజేపీ తర్వాతనే ఏ రాజకీయ పార్టీ అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటాయి. ప్రతీ ఎన్నికను చాలా సీరియస్‌గా తీసుకుని తగు రాజకీయ వ్యూహలు రచించి గెలుపుకోసం పాటు పడుతుంటారు కమలనాథులు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో పాగా వేసేందుకుగాను బీజేపీ ప్లాన్ చేసినట్లు రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ అధినేత జగన్‌ను ఢీ కొట్టే ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేస్తుందని సమాచారం.ఎన్నికలకు ముందర పలు రాష్ట్రాల్లో ఐటీ దాడులు నిర్వహించి బీజేపీ భయపెడుతుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటాయి.
ఈ నేపథ్యంలోనే ఇటీవల ఏపీ సీఎం జగన్ సన్నిహితులపై వరుసగా ఐటీ దాడులు చేస్తోందని టాక్ వినబడుతోంది. వైసీపీ రాజ్య సభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి చెందిన రాంకీ సంస్థలపై ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడుల ద్వారా వైసీపీ తమ ప్రత్యర్థే అనే సంగతి బీజేపీ పరోక్షంగా చెప్తోందని పలువురు అంటున్నారు. రాంకీ సంస్థలపై దాడులు జరిపిన ఆదాయ పన్ను శాఖ అధికారులు అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించారట. ఈ క్రమంలోనే రాంకీ సంస్థపై భారీ ఫైన్ విధించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే జగన్‌కు అత్యంత సన్నిహితుడైన బిజినెస్ మ్యాన్ పార్థసారధిరెడ్డికి చెందిన హెటిరో సంస్థపైన కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి.
Bharatiya Janata Party : వైసీపీ ఆర్థిక మూలాలపై దెబ్బ.. !
పార్థసారధిరెడ్డి వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు, ఈయనకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో సత్సంబంధాలు ఉన్నాయి. ఇటీవల హెటిరో సంస్థకు జగన్ సర్కారు స్థలం కేటాయించింది. ధనవంతుడిగా పేరున్న పార్థసారధిరెడ్డి జగన్‌కు ఎలక్షన్ టైంలో ఆర్థిక సాయం చేసినట్లు పలువురు చెప్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ సర్కారును ఎన్నికలకు మూడేళ్ల ముందు నుంచే దెబ్బతీయడానికి బీజేపీ పూనుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్‌ను డైరెక్ట్ ఢీ కొన లేక ఇలా ప్లాన్ చేసి మరీ పరోక్షంగా దెబ్బ తీసేందుకుగాను కమలనాథులు వ్యూహాలు రచించినట్లు టాక్ వినబడుతోంది. త్వరలో జగన్ సన్నిహితులు మరికొందరిపై ఐటీ దాడులు జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఆర్థిక మూలాలను దెబ్బ తీసేందుకుగాను బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసినట్లు వినికిడి.