Intinti Gruhalakshmi 2 Dec Today Episode : ఆవేశంలో విషం తాగిన నందు.. కడుపుతో ఉన్న దివ్య.. నందును తనవైపునకు తిప్పుకునేందుకు లాస్య మాస్టర్ ప్లాన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Intinti Gruhalakshmi 2 Dec Today Episode : ఆవేశంలో విషం తాగిన నందు.. కడుపుతో ఉన్న దివ్య.. నందును తనవైపునకు తిప్పుకునేందుకు లాస్య మాస్టర్ ప్లాన్

Intinti Gruhalakshmi 2 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 2 డిసెంబర్ 2023, శనివారం ఎపిసోడ్ 1117 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బాధ అనిపించినా ఏం చేయలేం అంటాడు పరందామయ్య. నేను కూడా మీ అబ్బాయిని ఇంట్లో నుంచి పంపించేయాలని అనడం లేదు మామయ్య అంటుంది తులసి. నువ్వు అనవు. అది నీ మంచితనం కానీ.. మా పరువు మేము నిలబెట్టుకోవాలి కదా అంటాడు […]

 Authored By gatla | The Telugu News | Updated on :2 December 2023,8:00 am

ప్రధానాంశాలు:

  •   నందు గురించి తులసితో మాట్లాడిన పరందామయ్య

  •  నందు ప్రవర్తన చూడలేక విషం తెచ్చుకున్న పరందామయ్య, అనసూయ

  •  కళ్లు తిరిగి కింద పడిన దివ్య

Intinti Gruhalakshmi 2 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 2 డిసెంబర్ 2023, శనివారం ఎపిసోడ్ 1117 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బాధ అనిపించినా ఏం చేయలేం అంటాడు పరందామయ్య. నేను కూడా మీ అబ్బాయిని ఇంట్లో నుంచి పంపించేయాలని అనడం లేదు మామయ్య అంటుంది తులసి. నువ్వు అనవు. అది నీ మంచితనం కానీ.. మా పరువు మేము నిలబెట్టుకోవాలి కదా అంటాడు పరందామయ్య. వాడు తప్పు చేశాడు. అందుకే వాడు బాధపడుతున్నాడు. పశ్చాతాప పడుతున్నాడు. అలా అని వాడిని క్షమించమని అనను. వాడితో నువ్వు మాట్లాడటం లేదనే వాడు అలా తయారవుతున్నాడు. పిచ్చోడు అవుతున్నాడు. దయచేసి వాడితో మాట్లాడు అమ్మ అని తులసిని వేడుకుంటుంది అనసూయ. తను చేసిన దానికి ఎంత బాధపడుతున్నారో అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాను. తనవన్నీ మోసపు పశ్చాతాపాలు. ఎక్కడ ఉంచాల్సిన వాళ్లను అక్కడ ఉంచితేనే నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను. నమ్మకం పోగొట్టుకున్న మనిషితో నార్మల్ గా ఉండటం నాకు చేతగాదు. పోనీ అని అనుకుంటే ఆ మనిషి వంకరగా మారడు అని నమ్మకం ఏంటి. ఇప్పుడు నేను బతుకుతోంది నా కోసం కాదు.. హనీ కోసం అంటుంది తులసి. ఏంటండి ఇది.. వాడు ఇలా ఎందుకు తయారయ్యాడు. నాకు ఏం అర్థం కావడం లేదు అని పరందామయ్యతో చెప్పి బాధపడుతుంది అనసూయ.

కట్ చేస్తే భాగ్య.. లాస్యకు కాఫీ ఇస్తుంది. తెగ ఆలోచిస్తున్నావు ఏంటి అంటే.. తెలివిగా ఆలోచించే మగాడిని చాణిక్యుడు అంటాడు. మరి.. తెలివిగా ఆలోచించే ఆడదాన్ని ఏమంటారు అని అడుగుతుంది లాస్య. దీంతో చాణకి అంటారు అంటే.. వేరే పదం ఏమైనా ఉంటే చెప్పు అంటే లేడీ చాణక్యుడు అంటుంది భాగ్య. దీంతో ఈ పేరు బాగుంది అంటుంది లాస్య. తులసి మీద కోపం నందుకు గతం మరిచిపోయేలా చేస్తుంది.  మళ్లీ నా ఓదార్పు కోరుకునేలా చేస్తుంది. 30 ఏళ్ల క్రితం ఉన్న ట్రాక్ మళ్లీ ఫ్రెష్ గా మొదలవుతుంది అంటుంది లాస్య. ఎందుకు లాస్య.. వాళ్ల బతుకులను వాళ్లను బతకనియ్యొచ్చు కదా అంటే.. వాళ్లను నేనెందుకు ప్రశాంతంగా ఉండనిస్తాను అంటుంది లాస్య. మళ్లీ నందును డిస్టర్బ్ చేయడానికి ఒక ప్లాన్ వేశానని.. ఆ ప్లాన్ ను భాగ్యకు చెబుతుంది లాస్య. ఎలా ఉంది అంటే.. వావ్ సూపర్ అని అంటుంది భాగ్య.

Intinti Gruhalakshmi 2 Dec Today Episode : సంజయ్ ని చూసి బాధపడ్డ రాజ్యలక్ష్మి

మరోవైపు బసవయ్య, ఆయన భార్య పాటలు పాడుకుంటూ పని చేస్తుంటారు. ఊరికే ఆ పాటలు ఏంటి మామయ్య అంటూ సంజయ్ చిరాకు పడతాడు. ముగ్గురూ కలిసి ఏదో మాట్లాడుకుంటూ ఉండగా.. పని వాళ్లంతా ఎక్కడ ఉన్నారు అని అంటుంది దివ్య. దీంతో వెంటనే లేచి మళ్లీ పని స్టార్ట్ చేస్తారు. సంజు కూడా వాళ్లతో కలిసి పని చేస్తుంటాడు. వాళ్లను అలా చేసి రాజ్యలక్ష్మికి బాధేస్తుంది. నువ్వేమో వీడిని ఇంటికి, ఆఫీసుకు వారసుడిని చేస్తా అంటావు. వాడేమో చివరకు ఈ ఇంటి పనోడిలా సెటిల్ అయిపోయేలా ఉన్నాడు అని చెబుతాడు బసవయ్య. దీంతో ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది రాజ్యలక్ష్మి.

మరోవైపు రాజ్యలక్ష్మి దిగులుగా కూర్చొని ఉండటం చూసి విక్రమ్ వస్తాడు. ఏంటమ్మా అలా ఉన్నావు. తమ్ముడిని సేవ్ చేసుకున్నాం కదా అంటే.. నా మనసు మార్చుకుంటానురా.. వాడు జైలులో ఉన్నా ఓకే కానీ… ఇక్కడ వాడిని పనివాడిలా చూడలేను అంటుంది రాజ్యలక్ష్మి. లేదంటే వాడిని బదులు నేను పనిదానిలా మారుతాను. వాడిని వదిలేయ్ అంటుంది రాజ్యలక్ష్మి. వాడి మంచికోసమే కదా ఇలా చేస్తోంది అంటాడు విక్రమ్. ఏమోరా.. నాకు ఇంట్లో జరిగే పనులేవీ నాకు నచ్చడం లేదు. నా ఐడియాలు ఏవీ నువ్వు తీసుకోవడం లేదు అంటుంది రాజ్యలక్ష్మి. నేనేంటో, నా మనసేంటో నీకు తెలియదా అమ్మ అంటే.. తెలుసు కాబట్టే అంటున్నాను. ఇంతకు ముందు అమ్మ కనిపించకపోతే గిలగిలా కొట్టుకునేవాడివి. ఇల్లు వాకిలి ఏకం చేసేవాడివి. ఈ మధ్య నన్ను ఓదార్చడానికి ట్రై చేస్తున్నావు. ఈ అమ్మ బాధ పట్టించుకోవడం లేదు. ఏంటి నాన్న నేను చేసిన తప్పు అని అడుగుతుంది రాజ్యలక్ష్మి.

దీంతో ఇప్పుడే కాదు.. ఎప్పటికీ మా అమ్మ తప్పు చేయదు. నేను చేయను. మా అమ్మ నన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. నేను కూడా ప్రేమిస్తుంటాను. ఈ కొడుకు మీద నమ్మకం ఉంచు. ఈ ఇంట్లో సంజయ్ కి ఎలాంటి అన్యాయం జరగదు అంటాడు విక్రమ్. ఇవన్నీ దివ్య వింటూ ఉంటుంది.

మరోవైపు పరందామయ్య, అనసూయ ఇద్దరూ విషం బాటిల్ ను పక్కన పెట్టుకొని కూర్చొంటారు. ఇంతలో నందు అక్కడికి వచ్చి ఏంటి నాన్న అది అంటాడు. దీంతో విషం అంటారు. ఈ ఇంట్లో చూస ఘోరాలు చూడటం ఇక మా వల్ల కాదు. ఈ కష్టాలను తట్టుకోవడం మా వల్ల కాదు. మమ్మల్ని నెత్తిన పెట్టుకొని చూడలేకపోయినా మా పరువు తీసి బజారున పడేస్తున్నావు. సమాధానం చెప్పుకోలేకపోతున్నాం. ఆ దేవుడికి దయ కలగడం లేదు. ఎప్పుడూ లేనిది మాకు ఎదురు తిరుగుతున్నావు ఏంట్రా. మా మాట వినకుండా తయారయ్యావు. తప్పు మీద తప్పు చేస్తున్నావు. ఒరేయ్ నువ్వు పద్ధతి మార్చుకోకపోతే మాకు విషం తాగడం తప్ప వేరే దారి లేదురా అంటారు. నువ్వు నీ నిర్ణయం చెబితే.. మేము మా నిర్ణయం తీసుకుంటాం అంటారు.

దీంతో ఆ విషం బాటిల్ ను చేతుల్లోకి తీసుకొని మూత ఓపెన్ చేస్తాడు నందు. దాన్ని తాగబోతాడు. దీంతో వెంటనే అనసూయ దాన్ని విసిరికొడుతుంది. ఏంట్రా నువ్వు చేస్తున్నావు అంటే.. నేను ఈ ఇంట్లో తప్పు చేస్తోంది. చావాల్సింది మీరు కాదు నేను. నేను పోతే మీ అందరికీ ప్రశాంతంగా ఉంటుంది. సమస్య కూడా తీరిపోతుంది. నేను చేసిన తప్పులకు శిక్ష కూడా పడుతుంది. కాదని అంటారా? అంటే.. నిన్ను నిందించడం లేదురా.. మారమని అంటున్నాం అంతే అంటారు పరందామయ్య, అనసూయ.

ఆఫీసులో నా మీద చెడుగా ప్రచారం చేస్తోంది నాన్న తులసి. తలెత్తుకొని తిరగలేకపోతున్నాను. ఇంట్లో నన్ను ఏమన్నా పర్వాలేదు. చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాను. ఈ నరకం అనుభవించలేకనే తాగుతున్నా. ఒంటరిగా అనిపించే తాగుతున్నా. నాకు మందే తోడుగా ఉంటోంది.. అంటూ ఎమోషనల్ గా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు నందు.

మరోవైపు విక్రమ్.. రాజ్యలక్ష్మి చెప్పిన విషయం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో దివ్య అక్కడికి వచ్చి ఏంటి సార్ తెగ ఆలోచిస్తున్నారు నా గురించా అంటే కాదు.. అమ్మ గురించి అంటాడు విక్రమ్. మన మనసులో మంచే ఉండొచ్చు. తప్పు చేయకపోవచ్చు. కానీ అది ఎదుటి మనిషికి అర్థం కాకపోతే దానికి అర్థం లేదు దివ్య అంటాడు విక్రమ్. నేను మారిపోయానని భ్రమ పడుతోంది మా అమ్మ. తనను పట్టించుకోవడం లేదని అనుమానపడుతోంది అంటాడు విక్రమ్.

ఎవరినీ హర్ట్ చేయాలని అనుకోదు మా అమ్మ. అదే మా అమ్మ గొప్పదనం అంటాడు విక్రమ్. సంజయ్ విషయంలో మనం చేసిన విషయంలో మనల్ని శత్రువులుగా చూస్తోంది అంటుంది దివ్య. నెగెటివ్ గా ఆలోచించకు దివ్య అంటే.. నెగెటివ్ గా ఆలోచించేది నేను కాదు.. అత్తయ్య గారు అంటుంది దివ్య.

మా అమ్మను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు నువ్వు అంటాడు విక్రమ్. దీంతో నువ్వే నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు అంటాడు విక్రమ్. దివ్య పదే పదే విసిగిస్తుంటే.. ఇక చాలు.. ఎందుకు అలా విసిగిస్తున్నావు అంటే అక్కడి నుంచి కోపంతో విక్రమ్ వెళ్లబోతాడు. ఇంతలో దివ్య కళ్లు తిరిగి కింద పడబోతుంది. వెంటనే విక్రమ్ వెళ్లి తనను పట్టుకుంటాడు. డాక్టర్ చూసి తను ప్రెగ్నెంట్ అని చెబుతాడు. దీంతో విక్రమ్ సంతోషంతో ఎగిరి గంతేస్తాడు. ఆ తర్వాత ఏ జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది