Intinti Gruhalakshmi 24 Nov Today Episode : ఆఫీసులో నందు పరువు పోయేలా చేసిన లాస్య.. విక్రమ్ పేరు మీద ఉన్న ఆస్తి లాక్కోవడానికి రాజ్యలక్ష్మి మాస్టర్ ప్లాన్.. వర్కవుట్ అవుతుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 24 Nov Today Episode : ఆఫీసులో నందు పరువు పోయేలా చేసిన లాస్య.. విక్రమ్ పేరు మీద ఉన్న ఆస్తి లాక్కోవడానికి రాజ్యలక్ష్మి మాస్టర్ ప్లాన్.. వర్కవుట్ అవుతుందా?

 Authored By gatla | The Telugu News | Updated on :24 November 2023,8:00 am

ప్రధానాంశాలు:

  •  నాకు ఎవ్వరి సపోర్ట్ అవసరం లేదన్న తులసి

  •  తులసి, నందు ఎప్పుడు కలుస్తారా అని బాధపడ్డ దివ్య

  •  హాస్పిటల్ బాధ్యత నేను చూసుకుంటా అని చెప్పిన దివ్య

Intinti Gruhalakshmi 24 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 24 నవంబర్ 2023, శుక్రవారం ఎపిసోడ్ 1110 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను ఎవ్వరి సపోర్ట్ ఆశించి బతకడం లేదు అని అంటుంది తులసి. దీంతో నిన్ను ఓదార్చడానికి వచ్చాను అక్క అంటే.. నన్ను ఎవ్వరూ ఓదార్చాల్సిన అవసరం లేదు అంటుంది. అయ్యో తల్లిని పోగొట్టుకొని బాధలో ఉన్నావు, కాసేపు నాతో మాట్లాడు అంటుంది లాస్య. దీంతో అవసరం లేదు అంటుంది తులసి. లాస్యను ఇక్కడి నుంచి తీసుకెళ్లు అని భాగ్యతో చెబుతుంది తులసి. దీంతో పదా లాస్య అని చెప్పి అక్కడి నుంచి లాస్యను తీసుకెళ్తుంది భాగ్య. మరోవైపు తన అమ్మానాన్న కలిసి ఉన్న ఫోటోలను చూసి బాధపడుతుంది దివ్య. ఇంతలో విక్రమ్ వచ్చి ఎందుకు బాధపడుతున్నావు అంటే.. అక్కడ ఇంట్లో జరిగిన గొడవ గుర్తొచ్చింది అంటుంది దివ్య. ఇప్పుడు ఇద్దరి మధ్య పూడ్చలేనంత అగాథం ఏర్పడింది. ఎప్పటికైనా అమ్మానాన్నలు కలుస్తారని అనుకున్నా కానీ.. ఇద్దరూ ఇక కలిసే అవకాశమే లేకుండా అయిపోయింది అంటుంది దివ్య. అమ్మ నిర్ణయాన్ని తప్పుపట్టేందుకు కూడా లేదు. తన తల్లి ఆఖరి చూపు చూసుకోకుండా పోవడానికి కారణం ఆయనే కదా.. అంటుంది దివ్య.

జీవితం ఉంది సంతోషంగా గడపడానికి.. పంతాలు, పట్టింపులు, రోషం.. వీటిని మనసులో పెట్టుకొని బతికితే మన అనుకునే వాళ్లు ఎవ్వరూ మిగలరు. ఒకరకంగా జీవితాన్ని నాశనం చేసుకోవడమే అంటాడు విక్రమ్. ప్రస్తుతం అమ్మ.. అమ్మమ్మ ఆలోచనల్లోనే మునిగిపోయి ఉంది. ఇప్పుడు ఎలా ఉందో ఏమో అంటుంది దివ్య. పనిలో ఇన్వాల్వ్ అయితే కానీ అత్తయ్య గారు నార్మల్ అవ్వరు. అంతకు మించి మరో దారి లేదు అంటాడు విక్రమ్. మరోవైపు రాజ్యలక్ష్మి కోపంతో కూర్చొని ఉంటే.. బసవయ్య వెళ్లి ఎందుకు ఇలా మౌనంగా ఉంటున్నావు. నీ మనసులో ఏం ఉందో చెప్పు అంటాడు బసవయ్య. దీంతో అసలు వాడు ఏమనుకుంటున్నాడు అని అడుగుతుంది రాజ్యలక్ష్మి. దీంతో ఎవడు నీ పెద్దకొడుకా అంటే.. నాకు ఉన్నది ఒక్కడే కొడుకు.. వాడే సంజయ్.. అంటుంది. దీంతో తప్పదు ఆస్తి వాడి పేరు మీద ఉంది కదా అంటాడు బసవయ్య. సంజయ్, బసవయ్య, రాజ్యలక్ష్మి ముగ్గురు కలిసి ఈ ఆస్తిని సంజయ్ చేతుల్లోకి వచ్చేలా చేయాలని అంటుంది రాజ్యలక్ష్మి. కానీ.. ఎలా అని అడుగుతాడు బసవయ్య. వాడిని ఎలా దారిలోకి తెచ్చుకుందాం అంటే.. అదే ఆలోచిస్తున్నా అంటుంది. నాది అలాంటి ఇలాంటి ఐడియా కాదు.. ఆ గాడిద గొడ్డు గాడి మాడు పగిలే ఐడియా చెబుతాను. కొద్దిగా టైమ్ ఇవ్వండి అంటుంది రాజ్యలక్ష్మి.

Intinti Gruhalakshmi 24 Nov Today Episode : తులసి ఆ మాట చెప్పిందని బాధపడ్డ నందు

మరోవైపు ఆఫీసుకు వెళ్లేందుకు రెడీ అవుతుంటాడు నందు. తులసిని నెమ్మదిగా మాటల్లో పెట్టి తనకు నా మీద కోపం పోయేలా చేస్తా అని అనుకుంటాడు నందు. ఆఫీసు టైమ్ అవుతోంది.. ఇటు వీడు రావడం లేదు.. అటు తులసి రావడం లేదు. అసలు ఏం జరుగుతోంది అని అనుకుంటారు పరందామయ్య, అనసూయ. ఇంతలో నందు హాల్ లోకి వస్తాడు. కానీ.. తులసి రాదు. మరోవైపు తులసి కూడా వస్తుంది. అత్తయ్య అంటుంది. కష్టాలనే తలుచుకుంటూ జీవిత ప్రయాణాన్ని ఆపలేం అంటాడు పరందామయ్య. వైరాగ్యం నాలో ఉత్సాహాన్ని మింగేస్తోంది అంటుంది తులసి. అలా నిరుత్సాహపడితే ఎలా.. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అంటాడు పరందామయ్య.

బాధ భరించడం ఎంత కష్టమో ఇప్పుడు తెలుస్తోంది అంటుంది తులసి. అమ్మ అనే ఒక్క మాట రోజుకు 100 సార్లు గుర్తొస్తోంది. అమ్మ ఉన్నప్పుడు మాట్లాడకపోతే.. నువ్వు మాట్లాడాలి అనుకున్నప్పుడు అమ్మ ఉండకపోవచ్చు అని అమ్మ గొప్ప విషయం చెప్పింది అంటుంది తులసి. అర్థమయ్యే టైమ్ కు అమ్మ లేదు అంటుంది తులసి. అందనంత దూరం వెళ్లిపోయింది. పదే పదే మా అమ్మ గురించి మాట్లాడి విసిగిస్తున్నాను. ఏం అనుకోవద్దు అత్తయ్య అంటుంది తులసి. నాకు మాట్లాడటానికి మీరు తప్ప ఎవరు ఉన్నారు అంటుంది తులసి. వెళ్లొస్తాను అత్తయ్య అంటుంది.

నందుకు చెప్పకుండానే ఆఫీసుకు బయలు దేరుతుంది తులసి. బయట నిలబడుతుంది. దీంతో నందు బయటికి వస్తాడు. సారీ లేట్ అయింది అని వచ్చి పదా అంటే తులసి రాదు. క్యాబ్ బుక్ చేసుకొని ఆఫీసుకు వెళ్తుంది తులసి. మరోవైపు లాస్య.. తులసి ఆఫీసులో ఉన్న ఉద్యోగికి ఫోన్ చేసి ఆఫీసులో నందు పరువు తీయాలని చెబుతుంది. తులసి అమ్మ చనిపోవడానికి కారణం నందే అని ఆఫీసులో ఉన్న అందరికీ చెప్పాలి. ఆ తర్వాత ఆ వార్త లీక్ చేసింది తులసే అని నందు నమ్మేలా చేయాలి అని చెబుతుంది. దీంతో ఓకే అంటాడు ఆ ఉద్యోగి.

మరోవైపు హాస్పిటల్ బాధ్యత విషయంలో చర్చ వస్తుంది. దీంతో హాస్పిటల్ బాధ్యత నేను తీసుకుంటాను అంటుంది దివ్య. రాజ్యలక్ష్మి ఏదో చేద్దామని అనుకుంటుంది కానీ.. అది వర్కవుట్ కాదు. మరోవైపు నందు రాగానే ఎవ్వరూ మాట్లాడరు. మీ గురించి ఆఫీసులో చాలా బ్యాడ్ గా ప్రచారం జరుగుతోంది. డైరెక్ట్ గా తులసి గారే మేనేజర్ తో వాళ్ల అమ్మ గారి చావుకు మీరే కారణమని చెప్పారట. దీంతో ఏం చేయాలో నందుకు అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది