Viral Video : ప్రాణంతో చెలగాటం.. ఏకంగా చిరుతపులి తోకపట్టి లాగిన వ్యక్తి.. వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : ప్రాణంతో చెలగాటం.. ఏకంగా చిరుతపులి తోకపట్టి లాగిన వ్యక్తి.. వీడియో !

 Authored By aruna | The Telugu News | Updated on :21 August 2022,8:00 am

Viral Video : క్రూర మృగాలను చూస్తేనే సాధారణ మనుషులకు ఒక్కోసారి ప్యాంట్ తడిసిపోతుంది. అలాంటిది ఒక్కసారిగా అవి జనావాసాల మీదకు వస్తే ఏమైనా ఉంటుందా? ఎక్కడివాళ్లు అక్కడ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరిగెడుతుంటారు.క్రూర మృగాల పంజాకు చిక్కకుండా దాక్కుంటారు. కొందరు మాత్రం ధైర్యం చేసి తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తారు. అందుకోసం ఏమైనా ఆయుధాలను వాడుతుంటారు.కానీ ఓ కామన్ మ్యాన్ మాత్రం జనావాసాల్లోకి వచ్చిన చిరుతపులి తోకను పట్టుకుని లాగుతూ దానిని ఓపికను టెస్టు చేశాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒక వేళ ఆ చిరుత రివర్స్ అటాక్ చేస్తే ఏమయ్యేదని కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. వన్య మృగాలు జనావాసంలోకి వచ్చి దాడి చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.ఇలాంటి వీడియోలు, ఘటనలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మాములుగా చిరుత పులులు దాడి చేస్తే ఏ జంతువు తప్పించుకోలేదు. అత్యంత వేగంగా పరిగేతే చిరుత పులులు అదే రేంజ్‌లో వేటాడుతూ ఉంటాయి. అలాంటి చిరుతను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. కానీ దాని తోకపట్టుకొని లాగే సాహసం ఎవరైనా చేస్తారా..

A man who pulled the leopard by the tail Video

A man who pulled the leopard by the tail Video

అదికూడా ఆ చిరుత బ్రతికి ఉన్నపుడు. కానీ ఈ వీడియోలో ఓ వ్యక్తి అదే పని చేశాడు. ఆ తర్వాత ఏమైందంటే.. తాజాగా ఓ చిరుత జనావాసంలోకి వచ్చింది.దానిని గ్రామస్తులంతా కలిసి తరిమారు.జనాలు ఒక్కసారిగా తరమడంతో అది భయపడిపోయింది. భయంతో పరుగులు పెట్టింది. చివరకు అది అలిసిపోయిన సమయంలో ఓ వ్యక్తి దాన్ని తోక పట్టుకొని లాగడం మొదలెట్టాడు. అది ముందుకు కదలడానికి ఎంత ప్రయత్నించినా అతడు వదిలి పెట్టకుండా దాని తోక, కాలు పట్టుకొని లాగాడు. పరిగెత్తి పరిగెత్తి అప్పటికే అలిసిపోయిన చిరుత చివరకు నేలపై పడిపోయింది.అనంతరం ఫారెస్ట్ అధికారులు అక్కడకు చేరుకుని చిరుతను సురక్షిత ప్రాంతంలో వదిలేసినట్టు తెలుస్తోంది.

 

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది