Viral Video : శభాష్.. బుల్లి కూనను ఆపదలో ఆదుకున్న కుక్క..
Viral Video : కుక్కలు ఏదేని ప్రమాదం ముందే జరగబోతుందని గ్రహిస్తుంటాయన్న సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే కొన్ని జాతుల కుక్కలకు ట్రెయినింగ్ ఇచ్చి మరీ ఆర్మీలో, పోలీసు వ్యవస్థలో తీసుకుంటారు. కాగా, సాధారణ లోకల్ బ్రీడ్ డాగ్స్ కూడా హెల్ప్ చేయడంలో ఈ కుక్క నిరూపించింది. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఆ కుక్కకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఇంతకీ ఆ కుక్క ఏం చేసిందంటే..
వైరలవుతున్న సదరు వీడియోలో కుక్క నార్మల్ గానే ఓ వీధిలో వెళ్తోంది. ఇంతలో ఆ కుక్కకు మ్యాన్ హోల్ లో పడిన ఓ బుల్లి కుక్క అరుపులు వినిపించాయి. కూన అరుపులు వినిపించిన వెంటనే ఈ డాగ్ స్పందించింది. వెంటనే మ్యాన్ హోల్ లో పడి ఉన్న కుక్క పిల్లను చూసి దానిని ఎలాగైనా బయటకు తీసుకురావాలని డిసైడ్ అయింది. అంతే ఇక ఆలస్యం చేయకుండా చక చకా పరుగులు తీయడం స్టార్ట్ చేసింది.
Viral Video : బుల్లి కుక్క అరుపులకు వెంటనే స్పందన..
మ్యాన్ హోల్ కు సమీపంలో కొద్ది దూరంలో ఉన్న ఖాళీ అట్ట బాక్సులను ఒక్కొక్కటిగా తీసుకొచ్చింది.. వాటి ద్వారా మ్యాన్ హోల్ నింపేసింది. దాంతో బుల్లి కూన వాటిపైన ఎక్కుతూ మెల్లిగా భూమ్మీదకు రావడానికి ప్రయత్నించింది. అయినా దాని వల్ల కావడం లేదు. దాంతో మరో కుక్క లోపలికి దిగి సపోర్ట్ ఇవ్వడంతో బుల్లి కూన బయటకు వచ్చేసింది. ఇక ఈ వీడియో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో కుక్క పిల్లకు సాయం చేయడానికి ముందుకొచ్చిన డాగ్ గ్రేట్ అని అంటున్నారు.
https://twitter.com/TheFigen/status/1488141128377503745