Viral Video : ఒకే కాలుతో కిలోమీటర్ నడిచి స్కూల్ కు వెళ్తున్న చిన్నారి.. హేట్సాఫ్ అంటున్న స్థానికులు.. వీడియో వైరల్
Viral Video : చదువు విలువ తెలిసిన వాళ్లు.. ఎలాగైనా పట్టుదలతో చదువుతారు.. వాళ్లకు ఎలాంటి ఆటంకాలు ఎదురైనా.. ఎన్ని అడ్డంకులు వచ్చినా చదువును మాత్రం వదలరు. చదువు విలువ తెలియని వాళ్లకు ఎంత చెప్పినా చదువు మీద దృష్టి పెట్టరు. ఎంత డబ్బు ఉన్నా.. ఎంత పలుకుబడి ఉన్నా.. చదువు ఉంటే సమాజంలో ఉండే గౌరవమే వేరు.చదువు విలువ తెలిసిన ఓ చిన్నారి.. స్కూల్ కు వెళ్లడం కోసం ఎంత కష్టపడిందో.. ఎలా అడ్డంకులను ఎదుర్కొన్నదో.. ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఈ వీడియో చూస్తే ఆ చిన్నారికి హేట్సాఫ్ చెప్పాల్సిందే.
మనం మాట్లాడుకునేది బీహార్ కు చెందిన ఓ బాలిక గురించి. తన వయసు 10 సంవత్సరాలు. తన పేరు సీమా మాంజీ. మావోయిస్ట్ ప్రాంతమైన ఫతేపూర్ కు చెందిన సీమాకు ఒక కాలు లేదు. కొన్ని ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తన ఎడమ కాలు మొత్తాన్ని కోల్పోయింది.అయినప్పటికీ.. తన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. తన గ్రామం నుంచి స్కూల్ కు వెళ్లాలంటే కిలోమీటర్ నడవాలి. పేద కుటుంబం కావడంతో.. తనను స్కూల్ కు అంత దూరం వాహనంలో పంపించే స్థోమత లేదు ఆ చిన్నారి తల్లిదండ్రులకు. దీంతో తనకు ఉన్న ఒక్క కాలుతోనే కిలోమీటర్ దూరంలో ఉన్న స్కూల్ కు గెంతుతూ వెళ్తోంది.
Viral Video : చిన్నారిని ఆదుకున్న డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్
ప్రతి రోజు.. క్రమం తప్పకుండా స్కూల్ కు ఒంటి కాలుతోనే ఆ చిన్నారి వెళ్లడం చూసి స్థానికులు షాక్ అవుతున్నారు. ఆ చిన్నారి పట్టుదల చూసి హేట్సాఫ్ చెబుతున్నారు. ఆ బాలిక పడుతున్న కష్టాన్ని చూసి.. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో చూసి.. జముయ్ కి చెందిన జిల్లా మెజిస్ట్రేట్ తనకు ట్రైసైకిల్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ప్రస్తుతం ఆ చిన్నారి.. ట్రై సైకిల్ మీద స్కూల్ కు వెళ్తోంది. ఆ చిన్నారి కష్టాన్ని తెలుసుకొని తనకు ట్రై సైకిల్ గిఫ్ట్ గా ఇచ్చిన మెజిస్ట్రేట్ ఉదారతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.