Viral Video : పెళ్లి కూతురు ఓ రేంజ్ లో మాస్ డ్యాన్స్.. ఎంట్రీ చూస్తే షాకవ్వాల్సిందే.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : పెళ్లి కూతురు ఓ రేంజ్ లో మాస్ డ్యాన్స్.. ఎంట్రీ చూస్తే షాకవ్వాల్సిందే.. వీడియో

 Authored By prabhas | The Telugu News | Updated on :6 August 2022,2:00 pm

Viral Video : నేటి తరం యువతీయువకులు సమాజంలో నడుస్తున్న ట్రెండ్‌ను బాగా ఫాలో అవుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఎవరైనా ఏదైనా కొత్తగా చేస్తే చాలు వారు కూడా అదేవిధంగా చేయాలని భావిస్తున్నట్టు యువత బాహాటంగానే తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అయితే, నేటితరం యువత తమ చదువు, ఉద్యోగం, పెళ్లి విషయంలో మాత్రం తల్లిదండ్రుల మాట కంటే తమకు నచ్చినట్టు చేస్తున్నట్టు పలు సర్వేలు ఇప్పటికే కుండబద్దలు కొట్టాయి. చదువు, ఉద్యోగం విషయంలో పేరెంట్స్ మాట వింటున్న కొందరు.. పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తమకు నచ్చిన వారిని చేసుకోవడంలో ఏమాత్రం జంకడం లేదు.

కొందరు ఇంట్లో వారిని ఒప్పించి చేసుకుంటుంటే మరికొందరు ప్రేమ పెళ్లిళ్లు గోప్యంగా చేసుకుంటున్నారు. అయితే, లవ్ లేదా అరెంజ్డ్ మ్యారేజ్ చేసుకునే వారు జీవితంలో వివాహం అనేది ఒక్కసారే వస్తుందని గ్రాండ్‌గా చేసుకోవాలని, డెస్టినేషన్ వెడ్డింగుల వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్, ఫోటోస్ కోసం లక్షలు ఖర్చుచేస్తున్నారు. ఇదేంటని అడిగితే మాకు మెమోరీస్ ఉండాలి కదా అని నిర్మోహమాటంగా చెబుతున్నారు. పాత తరం వారికి ఇదంతా కొత్తగా అనిపించినా నేటితరం వారు మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. మొన్నటివరకు పెళ్లి జరిగాక డ్యాన్సింగ్ వంటి ప్రొగ్రామ్స్ ఉండేవి. కానీ ఇప్పుడు పెళ్లికి ముందే సంగీత్ నిర్వహిస్తున్నారు.

Bride Mass Dance Video in youtube

Bride Mass Dance Video in youtube

కొన్ని చోట్ల పెళ్లి కూతురును డోలి, బుట్టల్లో తీసుకొస్తే.. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం పెళ్లికూతురు ఓ పది మందితో కలిసి డ్యాన్సులు వేసుకుంటూ పెళ్లి మండపంలోకి వస్తుంది. ఇలాంటి ఘటనే తాజాగా కేరళలో జరిగిన ఓ పెళ్ళిలో వెలుగుచూసింది. పెళ్లి కూతురు ముందు, ఓ గ్రూప్‌ వెనుక నుంచి మాస్ డ్యాన్సులు వేసుకుంటూ పెళ్లి మండపంలోకి ఎంట్రీ ఇవ్వడంతో అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. ముఖ్యంగా పెళ్లి కొడుకు నోరెళ్లబెట్టాడు. పెళ్లి హాల్‌లోని బంధువులు అమ్మాయిని వీడియో, ఫోటోలు తీస్తూ ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం యూ ట్యూబ్‌లో వైరల్ అవుతోంది.

YouTube video

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది