Viral Video : పిల్లలను చూసుకోవడం కష్టమే.. అవస్థలు పడుతున్న కుక్క..!
Viral Video : విశ్వాసానికి ప్రతీక అయిన కుక్కకు సంబంధించిన బోలెడన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం మనం చూడొచ్చు. ఒకసారి చేరదీస్తే చాలు..అలానే యజమాని కోసం కట్టుబడి ఉండే కుక్కలను చాలా మంది తమ ఇళ్లలో పెట్ యానిమల్స్‌గా పెంచుకుంటారు. ఈ సంగతులు అలా ఉంచితే..కుక్కకు సంబంధించిన ఓ డిఫరెంట్ వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకీ సదరు వైరల్ వీడియోలో కుక్క ఏం చేస్తుందంటే..
వైరల్ వీడియలో కుక్క తన పిల్లల కోసం తెగ కష్టపడిపోతున్నది. బేబి సిట్టర్ మాదిరిగానే తన పిల్లలందరి బాగోగులు చూసుకునేందుకుగాను ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలోనే కుక్క.. తన కూన కుక్కలను నోటితో కరుచుకుని వచ్చి ఒక దగ్గర కూర్చొపెడుతున్నది. అలా పెట్టిన తర్వాత మరో కూనను తీసుకొచ్చి అదే ప్లేస్ లో పెట్టేందుకుగాను ప్రయత్నిస్తున్నది. అంతలోనే మొదాలు పెట్టిన కూన అక్కడి నుంచి వెళ్లిపోతున్నది.
Viral Video : తల్లిని కష్టపడుతున్న కుక్క కూనలు..
ఫ్రెడ్ స్కల్ట్జ్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో చూసి నెటిజన్లు డిఫరెంట్ కామెంట్స్ చేస్తున్నారు. ‘బేబి సిట్టింగ్ వర్క్ ఎగ్జాహస్టింగ్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేయబడిన వీడియోను చూసి నెటిజన్లు రకరకాల పోస్టులు పెడుతున్నారు. పిల్లలను కాపాడుకోవడం కష్టమని, మరీ ముఖ్యంగా వాళ్లు చిన్నగా ఉన్నపుడు కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ బేబి సిట్టర్స్ కు రీతిలో వేతనాలివ్వడం లేదని పేర్కొన్నాడు.
https://twitter.com/FredSchultz35/status/1486766064700641281