Viral Video : స్నేహమంటే ఇదేరా.. గాడిద మీద నిలబడి మేక ఏం చేస్తుందో చూడండి..
Viral Video : సోషల్ మీడియాలో వైరల్ వీడియోలకు ఏం కొదవ లేదు. ప్రతీ రోజు ఏదో ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే, అందులో జంతువులకు సంబంధించిన వీడియోలు సగం కంటే ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు. ఇకపోతే ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతున్న ఈ వీడియో చూస్తే మీకు ఆనందం వేస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంతకీ ఈ వీడియోలో మేక గాడిదపైన నిలబడి ఏం చేస్తోందంటే..
యోగ్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియోలో గాడిద మీద మేక హాయిగా నిలబడి ఉంది. అలా గాడిద వీపు మీద నిలబడి చెట్టుపైనున్న ఆకులను తినేస్తోంది మేక. అది చూసి నెటిజన్లు సంతోష పడిపోతున్నారు. వీటి మధ్య స్నేహం చాలా చక్కగా ఉందని అనుకుంటున్నారు. గాడిద తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటూ మేక బరువును కూడా మోస్తుందనదని అంటున్నారు.
Viral Video : అలా బ్యాలెన్స్ చేస్తున్న గాడిద..
బహుశ స్నేహం అంటే ఇదేనేమో అని ఈ సందర్భంగా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇకపోతే అలా మేక హాయిగా తిని చెట్టుపైన ఉన్న కొమ్మల ఆకులను తినేందుకుగాను ఎంతగానో ట్రై చేసిందని, కొద్ది సేపు ఆకులను తిన్నాక.. ఆ తర్వాత మళ్లీ తన ముందర రెండు కాళ్లు పైకి ఎత్తి.. వెనుక కాళ్లతో గాడిద వీపు మీద నిలబడి కొమ్మను అందుకునే ప్రయత్నం చేయడం మనం వీడియోలో చూడొచ్చు.
https://twitter.com/Yoda4ever/status/1489252335469535251