Viral Video : పక్షిలా గాల్లోకి ఎగిరే కోడిని చూశారా ఎప్పుడైనా? నదిని ఎలా దాటిందో చూస్తే నోరెళ్లబెడతారు
Viral Video : సాధారణంగా కోళ్లు పైకి ఎగరలేవు. ఎందుకంటే.. వాటి శరీరం భారీగా ఉంటుంది. వాటికి కూడా ఇతర పక్షులలా రెక్కలు ఉన్నప్పటికీ భారీ ఆకారం వల్ల అవి ఎగరలేవు. ఎందుకంటే.. సాధారణంగా పక్షులు చాలా తక్కువ బరువును కలిగి ఉంటాయి. అందులోనూ కోళ్ల రెక్కలు చాలా చిన్నగా ఉంటాయి. అందుకే ఎక్కువగా ఎగరలేవు. కొంచెం దూరం వరకు మాత్రమే కోళ్లు ఎగురగలుగుతాయి.
ఎక్కడా కోళ్లు పక్షుల్లా ఎగరడం మనం చూడలేదు. నదులు దాటడం చూడలేదు. కానీ.. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో మాత్రం ఒక కోడి పక్షిలా ఎగిరితే ఎలా ఉంటుందో చూడబోతున్నారు. అవును.. ఈ వీడియో చూసి మీరు నోరెళ్లబెట్టడం మాత్రం ఖాయం.కోళ్లలో ఈ టాలెంట్ కూడా ఉంటుందా అని మీరు ఈ వీడియో చూసి ఆశ్చర్యపోతారు. ఆ వీడియోలో ఏముందంటే.. ఒక చోట కోళ్ల గుంపు ఉంది. కోళ్లన్నీ గింజలు తింటున్నాయి.
Viral Video : కోళ్లలో ఈ టాలెంట్ కూడా ఉంటుందా?
పక్కనే పెద్ద నది ఉంది. నది అవతల వైపు ఓ ఇల్లు ఉంది. ఇంతలో ఓ కోడి గింజలు తినడం ఆపేసి.. ఒక్కసారి రెక్కలు విదిల్చింది. వెంటనే గాల్లోకి ఎగిరి.. రెక్కలను ఊపుతూ.. నది వైపు దూసుకెళ్లింది. నదిని దాటి అవతలి వైపు వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియో చూసి షాక్ అవుతున్నారు. వామ్మో.. కోళ్లలో ఈ టాలెంట్ కూడా ఉందా అని ముక్కున వేలేసుకుంటున్నారు.
This is Amazing pic.twitter.com/8Syzdw6BnP
— Amazing Nature (@AmazingNature00) February 24, 2022