Harsha Sai : ఇక హ‌ర్ష సాయి జోలికి రాను, ఇదే చివ‌రి వీడియో అంటూ ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Harsha Sai : ఇక హ‌ర్ష సాయి జోలికి రాను, ఇదే చివ‌రి వీడియో అంటూ ..!

Harsha Sai : హ‌ర్ష సాయి.. ఈ పేరు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. యూట్యూబ్ ద్వారా ఫుల్ ఫేమ‌స్ అయిన ఇత‌ను అనేక సేవా కార్యక్ర‌మాలు కూడా చేప‌డుతున్నారు. అయితే ఆయ‌న‌పై ప్ర‌శంస‌లు కురిపించే వారే కాదు విమ‌ర్శించే వారు కూడా ఉన్నారు.వారిలో ముందుగా చెప్పుకోవ‌ల‌సి వ‌స్తే యువ సామ్రాట్ పేరు ముందు వినిపిస్తుంది. ఇన్నాళ్ళూ హర్ష సాయి మీద ఆరోపణలు చేస్తూ.. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ పై పోరాటం చేస్తూ వచ్చిన యువసామ్రాట్ ఇక […]

 Authored By ramu | The Telugu News | Updated on :29 June 2024,11:00 am

Harsha Sai : హ‌ర్ష సాయి.. ఈ పేరు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. యూట్యూబ్ ద్వారా ఫుల్ ఫేమ‌స్ అయిన ఇత‌ను అనేక సేవా కార్యక్ర‌మాలు కూడా చేప‌డుతున్నారు. అయితే ఆయ‌న‌పై ప్ర‌శంస‌లు కురిపించే వారే కాదు విమ‌ర్శించే వారు కూడా ఉన్నారు.వారిలో ముందుగా చెప్పుకోవ‌ల‌సి వ‌స్తే యువ సామ్రాట్ పేరు ముందు వినిపిస్తుంది. ఇన్నాళ్ళూ హర్ష సాయి మీద ఆరోపణలు చేస్తూ.. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ పై పోరాటం చేస్తూ వచ్చిన యువసామ్రాట్ ఇక విసిగిపోయారో.. లేక ఎవరైనా ఇబ్బంది పెట్టారో తెలియదు గానీ ఇప్పుడు ఆయ‌న త‌న ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేస్తూ… హర్ష సాయి మీద తాను చేసే ఆఖరి వీడియో ఇదే అంటూ కామెంట్స్ చేశారు. ఇక నా పని అయిపోయిందని అని తెలియ‌జేసారు.

Harsha Sai ఇదే చివ‌రి వీడియో..

హర్ష సాయి మీద నాలుగేళ్లుగా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఎన్నోఆరోప‌ణలు చేస్తూ వ‌చ్చారు యువ‌సామ్రాట్. మీడియా ఛానల్స్ లో ఇంటర్వ్యూల్లో కూడా పాల్గొని యువ‌సామ్రాట్ మీద నిర‌స‌న తెలియ‌జేశారు. ఆయ‌నకి శిక్ష ప‌డాలి అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హర్ష సాయి కోట్లు సంపాదించుకున్నాడని.. ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తే 40, 60 లక్షలు వస్తాయని, సేవ ముసుగులో హర్ష సాయి చేసేది మోసం అని అన్నారు. దీనిపై హర్ష సాయి కూడా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఆ తర్వాత యువసామ్రాట్ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుంది. హర్ష సాయి ఎంట్రీతో యువసామ్రాట్ వెనక్కి తగ్గారా అన్న సందేహం ఫ్యాన్స్ కి కలుగుతుంది.

Harsha Sai ఇక హ‌ర్ష సాయి జోలికి రాను ఇదే చివ‌రి వీడియో అంటూ

Harsha Sai : ఇక హ‌ర్ష సాయి జోలికి రాను, ఇదే చివ‌రి వీడియో అంటూ ..!

యువ‌సామ్రాట్ వీడియాలో మాట్లాడుతూ.. ‘హర్ష సాయి మీద ఏ వీడియోలు, ఏ కామెంట్లు చేయదలచుకోలేదని అన్నారు. హర్ష సాయి మీద ఇదే నా ఆఖరి వీడియో. ఎందుకంటే నాలుగేళ్ల నుంచి మంచి అనే ముసుగులో దాక్కున్న విష సర్పాన్ని లాగి కోరలు పీకి రోడ్డు మీద పడేశా.. నేను బెట్టింగ్ యాప్ లు ప్రమోట్ చేస్తా.. నేను కావాలనుకుంటే ఏడాదికి 300 కోట్ల నుంచి 500 కోట్లు సంపాదిస్తా.. ఇది సేవ కాదు బిజినెస్ అని.. కాళ్ళు వణుక్కుంటూ ఒక స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూలో కూర్చుంటా అని అందరి ముందు ప్రూవ్ చేశాను. ఇదే నా విజయం. ఇంతకన్నా నా విజయం ఏమీ లేదు. మీకు మీడియా ఛానల్స్ కి బాధ్యత ఉంటే ఎవరిది నిజం అని తేల్చండి. ఓపెన్ గా క్రైం చేస్తా అని ఒప్పుకున్న నేరస్తుడికి శిక్ష పడేలా చేసే బాధ్యత మీది, నాది కాదు. నా పనైపోయింది. జై హింద్’ అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Ravi Marka (@yuvasamrat999)

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది