Viral Video : బంజారా పెళ్లిలో డీజేలు పెట్టి డ్యాన్స్ తో దుమ్ములేపుతున్న లేడీస్
Viral Video : ఈమధ్యకాలంలో నెట్టింల్లో బంజారా వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోస్ ట్రెండింగ్ లో ఉంటున్నాయి. ఊరమాస్ స్టెప్పులతో ఆరుబయట డీజేలు పెట్టి దుమ్ములేపుతున్నారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, బంధువులు, ఫ్రెండ్స్ ఇలా ఇంటిల్లిపాది లేడీస్ కూడా అంతా ఒక్కదగ్గరకు చేరి డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. లేడీస్, యువతులైతే మరింత జోష్ గా డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తుంటారు. బంజారా పెళ్లి అంటే మామూలు సందడి ఉండదు..
చిన్నా పెద్దా అంతా కలిసి మాస్ డ్యాన్స్ చేస్తూ దుమ్ములేపుతారు. ఫంక్షన్స్ కి, మ్యారేజెస్ కి అదిరిపోయే డ్యాన్స్ చేస్తూ రచ్చ చేస్తారు. ఇక పెళ్లి విషయానికి వస్తే ఎంగేజ్ మెంట్ మొదలు డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అందరి ముందు మాస్ డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటారు. బంజారా డీజే సాంగ్స్ తో మోత మోగిస్తారు.. వయసుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా అంతా కలిసి రచ్చ రచ్చ చేస్తారు.
ఇక కపుల్స్ అయితే పెళ్లిలో పోటీపడుతూ మరి డ్యాన్స్ చేస్తారు. ఊర మాస్ స్టెప్పలు వేస్తుంటే చుట్టూ జనం చేరి ఈలలు వేస్తూ ఎంకరేజ్ చేస్తుంటారు. ప్రస్తుతం డీజే సాంగ్ లకు లేడీస్ అదిరిపోయే డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంటి బయట డీజేలు సెట్ చేసి వయుసుతో సంబంధం లేకుండా అంతా కలిసి డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. చిన్నపిల్లలు యువతులు, ఆంటీలు మాస్ డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.