Mangalavaram Movie : మంగళవారం సినిమాలో రొమాంటిక్ సీన్ లు ఇలా చేసారా..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Mangalavaram Movie : మంగళవారం సినిమాలో రొమాంటిక్ సీన్ లు ఇలా చేసారా..!

Mangalavaram Movie : హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ Payal Rajput ప్రధాన పాత్రలో నటించిన  మంగళవారం సినిమా నవంబర్ 17న విడుదలై సూపర్ హిట్ టాక్ ను అందుకుంది. ఆర్జీవి శిష్యుడు అజయ్ భూపతి ‘ ఆర్ఎక్స్ 100 ‘ సినిమాతో యూత్ ను ఎలా ఆకట్టుకున్నాడో ఈ సినిమాతో కూడా అదే విధంగా ఆకట్టుకున్నాడు. అలాంటి డైరెక్టర్ నుంచి ‘ మహాసముద్రం ‘ లాంటి సినిమా ఎవరు ఊహించలేదు. అది సరిగా ఆడలేదు. అయితే […]

 Authored By aruna | The Telugu News | Updated on :18 November 2023,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Mangalavaram Movie : మంగళవారం సినిమాలో రొమాంటిక్ సీన్ లు ఇలా చేసారా..!

  •  రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించిన ' మంగళవారం ' సినిమా నవంబర్ 17న విడుదల

Mangalavaram Movie : హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ Payal Rajput ప్రధాన పాత్రలో నటించిన  మంగళవారం సినిమా నవంబర్ 17న విడుదలై సూపర్ హిట్ టాక్ ను అందుకుంది. ఆర్జీవి శిష్యుడు అజయ్ భూపతి ‘ ఆర్ఎక్స్ 100 ‘ సినిమాతో యూత్ ను ఎలా ఆకట్టుకున్నాడో ఈ సినిమాతో కూడా అదే విధంగా ఆకట్టుకున్నాడు. అలాంటి డైరెక్టర్ నుంచి ‘ మహాసముద్రం ‘ లాంటి సినిమా ఎవరు ఊహించలేదు. అది సరిగా ఆడలేదు. అయితే ఇప్పుడు మళ్లీ తనకు కలిసి వచ్చిన పాయల్ రాజ్ పుత్ తో మంగళవారం సినిమాను తీశారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది.

అయితే ఈ సినిమా కోసం మంగళవారం టీం చాలా కష్టపడినట్లుగా తెలుస్తుంది. ఒరిజినల్ లొకేషన్ లో ఈ సినిమా షూట్ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే చాలా సన్నివేశాలు రియల్ స్టిక్ గా ఉండేటట్లు డైరెక్టర్ తీశారు. ఇక ఈ సినిమాలో బోల్డ్ సీన్లు ఎక్కువగానే ఉన్నాయి. ఒరిజినల్ షూట్ లు చేసినట్లు డైరెక్టర్ తెలిపారు. ఇందులో రొమాంటిక్ సీన్లలో కూడా పాయల్ బాగా నటించారు. ఆర్ఎక్స్ 100 లో కూడా పాయల్ బోల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇంకా ఈ సినిమాలో కూడా అంతకుమించి అనేలా బోల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చారు.

మంగళవారం సినిమా కొత్త కథేమీ కాదు. ఊర్లోని రకరకాల మనసులు ఉన్న మనుషులు, ఊర్లో వరుసగా చావులు, అందరి మీద అనుమానం వచ్చేలా స్క్రీన్ ప్లేను రాసుకోవడం, చివరకు మంచిగా కనిపించే వ్యక్తులు మంచిగా చూపించే వ్యక్తులు వాటన్నింటికి కారణం అని క్లైమాక్స్ అజయ్ భూపతి చూపిస్తారు. మంగళవారం విజువల్స్ ఆర్ఆర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. అజనీష్ ఆర్ఆర్ తెరపై చూస్తే రోమాలు నిక్కబడుచుకునేలా ఉంటుంది. ఈ సినిమా మొత్తం ట్విస్ట్ లతో కొనసాగుతుంది. చివరికి క్లైమాక్స్ అయితే పీక్స్ కి చేరుతుంది. అవే ఈ సినిమాకి బలం ఈ సినిమాలో ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది