Viral Video : కరెంట్ షాక్ కొట్టిన చిన్నారిని దేవుడిలా వచ్చి కాపాడిన ఓ పెద్దాయన .. వైరల్ వీడియో ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : కరెంట్ షాక్ కొట్టిన చిన్నారిని దేవుడిలా వచ్చి కాపాడిన ఓ పెద్దాయన .. వైరల్ వీడియో ..!

 Authored By aruna | The Telugu News | Updated on :29 September 2023,7:01 pm

Viral Video : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ఎక్కడ ఏం జరిగినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. అందులో కొన్ని వీడియోలు మనల్ని నవ్వింప చేసేలా ఉంటాయి. మరి కొన్ని వీడియోలు ఆశ్చర్యకరంగా ఉంటాయి..ఇంకొన్ని వీడియోలు ఆలోచింపజేసేలా ఉంటాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కాస్త ఆలోచింపజేసేలా ఉంది. కరెంట్ షాక్ కొట్టి ఓ చిన్నారి గిలగిలా కొట్టుకుంటూ ఉంటే అందరూ చూస్తూ ఉండిపోయారు. కానీ ఓ ముసలి తాత మాత్రం ఆ చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నం చేశాడు.

కష్ట సమయంలో ఎవరైనా సహాయం చేసిన సందర్భంలో సమయానికి దేవుడిలా వచ్చారు అంటూ ఉంటాం, కొన్నిసార్లు ప్రాణం పోతుంది అనుకున్న సమయంలో అద్భుతాలు జరుగుతుంటాయి. ఇలాంటి ఆశ్చర్యకర ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ఈ వీడియోలో ఓ చిన్నారి కరెంట్ షాక్ కు గురై నీళ్లలో గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. దీంతో అందరూ భయపడి దూరంగా పారిపోయారు. మరోవైపు పిల్లాడు ఏడుస్తూ అల్లాడిపోతుంటాడు. కరెంట్ షాక్ కొడుతుందని భయంతో ఎవరు దగ్గరికి వెళ్లే సాహసం చేయలేదు.

Old man save the child from current shck Viral Video

Old man save the child from current shck Viral Video

ఈ సమయంలోనే ఓ పెద్దాయన ధైర్యం చేసి దగ్గరికి వెళ్ళాడు. అయితే అతడు చేత్తో పట్టుకోకుండా ఆ పిల్లాడికి ఒక కర్రను అందిస్తాడు. దీంతో చిన్నోడు కర్రను గట్టిగా పట్టుకుంటాడు. అలా పట్టుకోగానే ఆ పెద్దాయన పక్కకు లాగేస్తాడు. దీంతో ప్రమాదం నుంచి క్షేమంగా భయపడతాడు. ఆ సమయంలో ఆ పెద్దయన రాకుంటే ఆ పిల్లాడి ప్రాణాలు ప్రమాదంలో ఉండేవి. సమయానికి స్పందించి చిన్నారి ప్రాణాలను కాపాడిన ఆ పెద్దాయనను అందరూ అభినందించారు. ఈ వీడియో పై నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేశారు. దేవుడిలా సమయానికి వచ్చావు అని కొందరు, అంతమంది చూస్తున్నారు కానీ ఎవరికి ఆ ఆలోచన రాలేదు అని మరి కొందరు, సూపర్ తాత అంటూ ఇంకొందరు కామెంట్ లు చేశారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది