viral video : వృద్ధుడి గలీజ్ పని .. మాల్ లో అమ్మాయిని ఏం చేసాడో చూడండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

viral video : వృద్ధుడి గలీజ్ పని .. మాల్ లో అమ్మాయిని ఏం చేసాడో చూడండి..!

viral video : బెంగళూరులో నిత్యం రద్దీగా ఉండే లూలూ మాల్ లో ఓ వ్యక్తి మహిళను శారీరకంగా, లైంగికంగా వేధించిన వీడియో ఇప్పుడు బయటికి రావడంతో వైరల్ గా మారింది. పాత మైసూర్ రోడ్డు లోని గోపాలపురం లూలూ మాల్ లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సందర్భంగా మాల్ లో ఉన్న యశ్వంత్ అనే వ్యక్తి అతడి ఫోన్లో వీడియో తీసి instagram లో షేర్ చేశాడు. మహిళతో అసభ్యంగా […]

 Authored By aruna | The Telugu News | Updated on :1 November 2023,9:00 pm

ప్రధానాంశాలు:

  •  వృద్ధుడి గలీజ్ పని ..

  •  మాల్ లో అమ్మాయిని ఏం చేసాడో చూడండి

viral video : బెంగళూరులో నిత్యం రద్దీగా ఉండే లూలూ మాల్ లో ఓ వ్యక్తి మహిళను శారీరకంగా, లైంగికంగా వేధించిన వీడియో ఇప్పుడు బయటికి రావడంతో వైరల్ గా మారింది. పాత మైసూర్ రోడ్డు లోని గోపాలపురం లూలూ మాల్ లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సందర్భంగా మాల్ లో ఉన్న యశ్వంత్ అనే వ్యక్తి అతడి ఫోన్లో వీడియో తీసి instagram లో షేర్ చేశాడు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైరల్ అయిన వీడియోలో మాల్లో ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా మహిళ వెనుక భాగాన్ని తాకటం కనిపించింది. ఈ సంఘటన ఆదివారం లూలూ మాల్ ఫాంటరా లో జరిగింది.

ఈ వీడియోలోని ఓ వ్యక్తి అమ్మాయిల తో ఈ రకంగా శారీరకంగా ఇబ్బంది పెట్టాడని సోషల్ మీడియాలో యశ్వంత్ పోస్ట్ చేశాడు. రద్దీగా ఉండే ప్రాంతంలో మహిళలు, యువతులు వెంట వెళుతున్న అతడిని చూసినప్పుడు మొదట నాకు అనుమానం వచ్చింది. అప్పుడు నేను వీడియో రికార్డు చేశాను. అతడిని నేను అనుసరించాను అని వీడియోను షేర్ చేసిన వ్యక్తి ఈ ఘటనపై మాల్ లోని సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించాడు. అయితే సెక్యూరిటీ గార్డులు వచ్చే సమయానికి ఆ వ్యక్తి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు అని పోలీసు అధికారులు అంటున్నారు.

బెంగళూరు పోలీసులు సోషల్ మీడియా లోని పోస్ట్ పై స్పందించారు. వీడియోలోని వ్యక్తి పై ఫిర్యాదు చేయటానికి వీడియో షేర్ చేసిన వ్యక్తి తమను సంప్రదించాలని యశ్వంత్ కి పోలీసులు మనవి చేశారు. ఈ వీడియో వైరల్ గా మారడంతో బెంగళూరు లోని పోలీసులు ఫిర్యాదు తీసుకొని విచార చేపట్టినట్లు సమాచారం. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్లను ఊరికే వదిలేస్తే మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తూ ఉంటారని కొందరు వాదిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గట్టిగ డిమాండ్ చేస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది