Viral Video : వాహ్.. కుందేలు కూడా మసాజ్ చేస్తుందోచ్.. ఇక్కడ చూడండి.. వైరల్ వీడియో!
Viral Video : సోషల్ మీడియాలో యూనిక్ వీడియోస్ వైరల్ అవుతుండటం మనం చూడొచ్చు. మరీ ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట బాగా వైరలవుతుంటాయి. ఇకపోతే వన్యప్రాణుల వీడియోలు చూసి నెటిజన్లు చాలా ఆనందపడిపోతుంటారు. తమకు మానసిక ఆనందం లభించిందని అనుకుంటుంటారు. ఈ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సదరు వీడియోలో కుందేలు మసాజ్ చేస్తోంది.
గుల్దుర్ బకాలిమ్ అనే ట్విట్టర్ యూజర్ ట్విట్టర్ వేదికగా ‘ర్యాబిట్ మసాజ్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోను చూసి నెటిజన్లు తెగ ఆనందపడిపోతున్నారు. వాహ్..వాట్ ఏ మసాజ్ అని అనుకుంటున్నారు. సదరు వీడియోలో ర్యాబిట్ మరో బుల్లి జంతువుకు తన ముందర కాళ్లతో మసాజ్ చేస్తోంది. అయితే, ఒకే ఒక కాలితో కుందేలు అలా చక్కగా మసాజ్ చేస్తోంది.మరో చిన్న ప్రాణి వీపుపైన కుందేలు అలా తన ముందరి ఒకే ఒక్క కాలుతో చక్కగా చకచక మసాజ్ చేస్తోంది.

rabbit in Cat video viral in internet
Viral Video : ఒంటి కాలుతో ర్యాబిట్ మసాజ్..
ఇకపోతే ఆ వన్యప్రాణి కుందేలును చూస్తే మనసుకు ఆహ్లాదం కలుగుతున్నదని ఈ సందర్భంగా నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సదరు వీడియోను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుందేలు ఇలా కూడా మసాజ్ చేయగలదా అని చర్చించుకుంటున్నారు. ఇకపోతే వన్యప్రాణి అయిన కుందేలును చూసి చాలా మంది ఆనందపడిపోతుండటం మనం చూడొచ్చు. అటువంటిది మసాజ్ చేసే కుందేలును చూసి ఇంకా సంబురపడిపోతున్నారు.
https://twitter.com/guldurbakalim/status/1482319928921403392?s=20