క్లాస్ రూమ్ లో టీచర్ నిర్వాకం చూసి బిత్తరపోయిన గ్రామ ప్రజలు.. వైరల్ వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

క్లాస్ రూమ్ లో టీచర్ నిర్వాకం చూసి బిత్తరపోయిన గ్రామ ప్రజలు.. వైరల్ వీడియో

 Authored By aruna | The Telugu News | Updated on :26 September 2023,4:00 pm

ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ఎక్కడ ఏం జరిగినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ టీచర్ కి సంబంధించిన వీడియో దేశమంతా వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ సేహోర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా పరిధిలోని మోగ్రా అనే గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ధరమ్ సింగ్ వర్మ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అయితే తాజాగా తరగతిది గదిలో అతడు చేసిన నిర్వాకం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

తరగతి గదిలోకి రాగానే పాఠాలు చెప్పాల్సిన అతను, అందుకు విరుద్ధంగా క్లాసు రూమ్ లోకి రాగానే దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. టీచర్ పడుకోవడంతో విద్యార్థులు ఇదే మంచి సమయం అని ఎంచక్కా బయటికి వెళ్లి ఆటలు ఆడడంలో మునిగిపోయారు. అయినా టీచర్ మాత్రం ఏ మాత్రం సోయి లేకుండా ప్రపంచంతో నాకేమీ సంబంధం లేనట్లుగా గాఢ నిద్రలో మునిగిపోయాడు. అయితే పిల్లలంతా బయట ఆడుకోవడం చూసిన గ్రామ ప్రజలు లోపలికి వచ్చి చూడగా టీచర్ పడుకొని ఉన్నారు.

Teacher management in the classroom viral video

#image_title

టీచర్ నిర్వాకం చూసి షాక్ అయ్యి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. చివరకు ఈ విషయం జిల్లా విద్యా అధికారుల దృష్టికి వెళ్ళింది. దీంతో ఈ విషయాన్ని అధికారులు సీరియస్గా తీసుకున్నారు. ఘటనపై సమగ్ర విచారణ ఆదేశించారు. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కుర్చీలో కూర్చొని కునుకు తీసే టీచర్లను చూశాం, కానీ ఇలాంటి టీచర్లను ఎప్పుడూ చూడలేదని కొందరు, ఈయనకు క్లాస్ రూమ్, బెడ్ రూమ్ ఒకటేనేమో అని మరికొందరు, ఇలాంటి టీచర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఇంకొందరు కామెంట్లు చేశారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది