Viral Video : ఈ కుక్క తెలివి మామూలుగా లేదు.. ఒక్క చెక్క కూడా కింద పడనివ్వడం లేదు..
Viral Video : అదేంటో గానీ.. ఈ మధ్య పెంపుడు కుక్కలు కూడా చాలా తెలివి మీరి పోతున్నాయండోయ్. మనుషులతో పెరగడం వల్లనో లేకపోతే ఇంకేంటో అర్థం కావట్లేదు. బయట వీధుల్లో తిరిగే కుక్కలకు ఇంత తెలివి లేదుగానీ.. పెంపుడు కుక్కలకు మాత్రం చాలా విషయాలు తెలుస్తున్నాయి. మనుషుల మాటలను కూడా అర్థం చేసుకుంటున్నాయి. ఆటలు ఆడుతున్నాయి, ఆట పట్టిస్తున్నాయి. అంతే కాకుండా తన యజమానిని ఎవరు ఏమన్నా సరే ఊరుకోకుండా ఆగ్రహం తెలుపుతున్నాయి.
ఇలా ఎన్నో విధాలుగా కుక్కలు తెలివిగా మారిపోతున్నాయి.అయితే ఇలా కుక్కల తెలివికి సంబంధించిన వీడియోలకు నెట్టింట్లో బాగానే వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా ఇలాంటి కుక్క తెలివికి సంబంధించిన వీడియోనే బాగా పాపులర్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో ఈ పెంపుడు కుక్క ముందు ఓ చెక్కలతో పేర్చిన నిర్మాణం ఉంటుంది. అందులోంచి ఓనర్ చెప్పిన దాన్ని ఏ మాత్రం పొరపాటు జరగకుండా.. మిగిలిన చెక్కలు కిండ పడకుండా..
Viral Video : మనుషులకు కూడా కష్టమే..
చాలా జాగ్రత్తగా కుక్క బయటకు తీస్తుంది. మనుషులకు కూడా దాన్ని తీయడం చాలా కష్టం. అలాంటిది కుక్క దేన్నీ పట్టుకోకుండా నోటితో అలా తీయడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది.ఇక ఈ వీడియో మీద చాలామంది వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి తెలివైన కుక్కను దేశ సేవల్లో ఉపయోగించాలంటూ కామెంట్లు పెడుతున్నారు.
https://twitter.com/buitengebieden_/status/1485681928527351813