Viral Video : ఆడుకునే వయసులోనే అష్ట కష్టాలు… కానీ ఈ బుడ్డోడు ధైర్యం చూస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే…!
Viral Video : సమస్యలు సవాళ్లు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. వాటిని అధిగమించితేనే విజయం సాధిస్తారు. ఆ విజయం దక్కాలి అంటే నిరంతరం శ్రమించాల్సిందే. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే బాలుడికి కథ కూడా అంతే. కష్టాలు అన్ని తన జీవితాన్ని కమ్మేసినప్పటికి గెలుపుకై పోరాడుతున్నాడు. తండ్రి మరణించిన తల్లి వదిలి వెళ్ళిపోయిన వనక లేదు బేనక లేదు. ఒకపక్క చదువు సాగిస్తూనే మరోపక్క కష్టపడి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతనే జస్ప్రీత్ . ఈ […]
ప్రధానాంశాలు:
Viral Video : ఆడుకునే వయసులోనే అష్ట కష్టాలు... కానీ ఈ బుడ్డోడు ధైర్యం చూస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే...!
Viral Video : సమస్యలు సవాళ్లు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. వాటిని అధిగమించితేనే విజయం సాధిస్తారు. ఆ విజయం దక్కాలి అంటే నిరంతరం శ్రమించాల్సిందే. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే బాలుడికి కథ కూడా అంతే. కష్టాలు అన్ని తన జీవితాన్ని కమ్మేసినప్పటికి గెలుపుకై పోరాడుతున్నాడు. తండ్రి మరణించిన తల్లి వదిలి వెళ్ళిపోయిన వనక లేదు బేనక లేదు. ఒకపక్క చదువు సాగిస్తూనే మరోపక్క కష్టపడి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతనే జస్ప్రీత్ . ఈ బాలుడి స్టోరీ ప్రతి ఒక్కరిని కదిలిస్తుందని చెప్పాలి. అయితే ఢిల్లీ లోని తిలక్ నగర్ కు చెందిన జస్ప్రీత్ కష్టాలను వింటే కన్నీరు పెట్టడమే కాదు ఆ బాలుడిని చూసి స్ఫూర్తి కూడా పొందుతారు. పెద్ద అయిన తరువాత పడాల్సిన కష్టాలు రావాల్సిన బాధ్యతలు అతనికి ఆడుకునే వయసులోనే వచ్చి మీద పడ్డాయి.
Viral Video : ఓ ఫుడ్ బ్లాక్ ద్వారా జస్ప్రీత్ కథ బయటికి…
తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. తండ్రి మరణం తర్వాత పిల్లల దగ్గర ఉండడం ఇష్టంలేక 14 ఏళ్ల అక్క తో పాటు జస్ప్రీత్ ని కూడా వదిలేసి తన తల్లి పంజాబ్ వెళ్ళిపోయింది. దీంతో అక్క తమ్ముళ్లు ఇద్దరు ఎవరు లేని అనాధలుగా మిగిలిపోయారు.ఏ పిల్లోడు అయినా ఇలాంటి సమయంలో అల్లాడిపోతాడు. కానీ జస్ప్రీత్ అలా కాదు. అందరిలా ఏడుస్తూ కూర్చోలేదు. ఆ బాలుడు చిన్నవాడు అయిన కుటుంబానికి పెద్దదిక్కు అయ్యాడు. కుటుంబ బాధ్యతల్ని తన భుజాల మీద వేసుకున్నాడు. విపరీతమైన సవాళ్లు చుట్టుముట్టిన పగటిపూట శ్రద్ధగా పాఠశాలకు హాజరవుతూ సాయంత్రం రోడ్డు పక్కన స్టాల్ పెట్టి ఎగ్ రోల్స్ అమ్మి కుటుంబాన్ని పోషిస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు.అయితే జస్ప్రీత్ కథను ఒక ఫుడ్ బ్లాగర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. చిన్న వయసులోనే ఎంతో బాధ్యతగా మాట్లాడిన జస్ప్రీత్ తీరు చూసి నేటిజనులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అతని మాటలు చాలామంది హృదయాలను కదిలిస్తున్నాయి.
ఆ వయసులో అతని ధైర్యాన్ని చూసి స్ఫూర్తి పొందుతున్నారు. అంతేకాక ఈ వీడియోని ప్రముఖ భారత పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర తన ఎక్స్ లో షేర్ చేసి ఆ బాలుడు గొప్పతనాన్ని మెచ్చుకున్నారు. మహేంద్ర ఫౌండేషన్ ద్వారా ఆ బాలుడి విద్యకి సహాయం చేస్తానని ఆయన మాట కూడా ఇచ్చారు. దీంతో జస్ప్రీత్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో చాలామంది అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజమైన యోధుడు అని కామెంట్స్ చేస్తున్నారు. ఏదో ఒక రోజు కష్టాలను అధిగమించి గొప్పవాడు అవుతాడని ఓ యూజర్ రాస్కొచ్చాడు. అంతేకాదు సాయం చేయడానికి ఎంతోమంది అతడి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కోలేక ఎంతోమంది బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న ఈ రోజుల్లో చిన్నవయసులోనే అంత పెద్ద బాధ్యతలు మోస్తున్న జస్ప్రీత్ మాత్రం ఓ రియల్ హీరో అని చెప్పాలి. అలాంటి జస్ప్రీత్ తన జీవితంలో కచ్చితంగా విజయం సాధించాలని మనమంతా కోరుకుందాం.